ETV Bharat / sports

వింటేజ్ 'పాండ్య' ఈజ్ బ్యాక్- ఏకైక బ్యాటర్​గా రికార్డ్! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Hardik Pandya T20 World Cup: టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య సూపర్- 8లో బంగ్లాదేశ్​పై అద్భుత ఇన్నింగ్స్​తో పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో తెలుసా?

Hardik pandya T20
Hardik pandya T20 (Getty Images (Left), Associated Press (Right))
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 7:36 AM IST

Hardik Pandya T20 World Cup: టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శనతో బంగ్లాదేశ్​పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్- 8లో జరిగిన తాజా మ్యాచ్​లో హార్దిక్ తొలుత బ్యాట్​తో అజేయంగా 50 పరుగులు బాదగా, అనంతరం బంతితోనూ రాణించి 1 వికెట్ పడగొట్టాడు. దీంతో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో కనబర్చిన పాండ్యకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా లభించింది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్​కప్​లో ఏకైక భారత ప్లేయర్​గా హార్దిక్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

2016 నుంచి హార్దిక్ టీ20 వరల్డ్​కప్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొట్టికప్​ చరిత్రలో 300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన ఏకైక టీమ్ఇండియా ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్​లో హార్దిక్ ఇప్పటివరకు 21 మ్యాచ్​లు ఆడగా 137.89 స్ట్రైక్​రేట్​తో 302 పరుగులు చేశాడు. అటు బంతితోనూ రాణిస్తూ 21 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత అందుకున్న 5వ ప్లేయర్​గానూ నిలిచాడు. పాండ్య కంటే ముందు ఈ ఘనత సాధించిన ప్లేయర్లు.

  • షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లు
  • షాహిద్ అఫ్రిదీ (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లు
  • షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లు
  • డ్వేన్​ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు

పాండ్య ఖాతాలోకి ఆ రికార్డు కూడా
ఈ మ్యాచ్​లో పాండ్య ఆరో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. టీ20 ప్రపంచకప్​లో ఆరో స్థానంలో బ్యాటింగ్​కు వచ్చి 50 పరుగులు చేసిన తొలి ప్లేయర్​గానూ పాండ్య రికార్డు కొట్టాడు. ఈ రికార్డు ఇదివరకు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. కాగా, హార్దిక్ తాజా ఇన్నింగ్స్​తో ఈ రికార్డు బద్దలైంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, రోహిత్​ సేన 50 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తేలిపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. నజ్ముల్ హసన్ శాంటో (40 పరుగులు) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెలో 2, హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు.

హార్దిక్, కుల్దీప్ అదరహో- బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ - T20 World Cup 2024

సెమీస్​పై భారత్ కన్ను - టీమ్​ఇండియాను కలవరపెడుతున్న సమస్య అదొక్కటే! - T20 Worldcup 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.