ETV Bharat / sports

ఆమెను పెళ్లాడిన మహిళా క్రికెటర్ - అప్పుడు విరాట్​కు ప్రపోజల్ - ఇప్పుడు ప్రేయసితో ఇలా - England Cricketer Danni Wyatt - ENGLAND CRICKETER DANNI WYATT

Danni Wyatt Marriage : ఇంగ్లాండ్ టీమ్​ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రేయసి జార్జి హాడ్జ్​ను పెళ్లాడింది. లండన్‌లోని ఓ టౌన్ ​హాల్ వేదికగా ఈ జంట వివాహం గ్రాండ్​గా జరిగింది. ఆ విశేషాలు మీ కోసం.

Danni Wyatt Marriage
Danni Wyatt (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 2:59 PM IST

Updated : Jun 11, 2024, 3:37 PM IST

Danni Wyatt Marriage : ఇంగ్లాండ్‌ జట్టు మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్‌ తాజాగా పెళ్లి పీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ప్రేయసి జార్జి హాడ్జ్​తో తాజాగా ఈ స్టార్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. లండన్‌లోని చెల్సియా ఓల్డ్‌ టౌన్ హాల్‌ వేదికగా జూన్‌ 10న వీరి మ్యారేజ్ గ్రాండ్​గా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ ఫ్యాన్స్​ కోసం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా, క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్​ తెలుపుతున్నారు.

ఇక వ్యాట్‌ ప్రియురాలు జార్జి హాడ్జ్‌ సీఏఏ బేస్‌కు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్‌ ఏజెంట్‌గానూ ఆమె కీలక బాధ్యతలు చేపడుతున్నారు. 2019 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. 2023 మార్చిలో సౌతాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ జంట ప్రకటించిన సమయంలో వారి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు.

విరాట్​కు ప్రపోజ్ చేసిన వ్యాట్
ఇక వ్యాట్‌ కెరీర్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్‌ టీమ్​ తరఫున్ ఈ ఆల్​రౌండర్ ఇప్పటి వరకు 105 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌ల్లో చురుగ్గా ఆడింది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లోనూ తన పెర్ఫామెన్స్​తో ఆకట్టుకుంది. అయితే 2014లో టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి సరదాగా ఈమె సరదాగా ప్రపోజ్‌ చేసింది. ఈ విషయం అప్పట్లో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.

ఇలా మహిళా ప్లేయర్స్​ ఒకరినొకరు ఇష్టపడి వివాహ బంధంలోకి అడుగుపెట్టడం ఇదేం తొలిసారి కాదు. ఇటువంటి సందర్భాలు క్రీడారంగంలో ఎన్నో జరిగాయి. 2022లో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు కేథరిన్‌ బ్రంట్‌, నటాలియా సీవర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.య అంతకంటే ముందు న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్‌ - తహుహు కూడా పెళ్లి చేసుకున్నారు. సౌతాఫ్రికా క్రికెటర్లు మరిజేన్‌ కాప్‌, డాన్‌ నీకెర్క్‌ కూడా ఒక్కటయ్యారు. ఇలా ఎంతో మంది ఇప్పుడు తమ హ్యాపీ లైఫ్​ను గడుపుతున్నారు.

వెంకటేశ్ వెడ్స్ శ్రుతి - ఓ ఇంటివాడైన యంగ్ క్రికెటర్

భారత్​ అమ్మాయితో పాక్​ క్రికెటర్ పెళ్లి..!

Last Updated : Jun 11, 2024, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.