Rohit About World Cup: టీ20 వరల్డ్‌కప్ గెలుపును టీమ్ఇండియా ప్లేయర్లు ఎంజాయ్ చేస్తున్నారు. టోర్నీ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్లేయర్లంతా విన్నింగ్ వైబ్‌లోనే ఉన్నారు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐ టీవీతో తాజాగా మాట్లాడాడు. ఈ విజయం పట్ల ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ట్రోఫీ నెగ్గడం ఓ కలలాగే అనిపిస్తుందని అన్నాడు. ఫైనల్లో గెలుపొందిన తర్వాత తన ఎమోషన్స్ గురించి రోహిత్ చెప్పాడు.
'దీన్ని నమ్మలేకపోతున్నా. నాకు ఓ కలలాగే ఉంది. ఇది నిజంగా జరిగినా సరే, జరగనట్లే అనిపిస్తోంది. టీమ్మేట్స్తో కలిసి ఈ గెలుపును ఎంతో ఆస్వాదించాను. కప్పు నెగ్గాక నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. కానీ, అది ఓ సమస్యే కాదు. ఇంటికెళ్లిన తర్వాత పడుకోవడానికి ఎంతో టైమ్ ఉంటుంది. ఈ విజయాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నాను. దీని కోసం ఎన్నో ఏళ్ల పాటు కలలు కన్నాం. జట్టుగా ఎంతో శ్రమించాం. ఇప్పుడు దాన్ని సాకారం చేసుకోవడం గొప్ప ఉపశమనంగా అనిపిస్తోంది. ఒక లక్ష్యం కోసం శ్రమిస్తూనే ఉంటే ఏదో ఒక రోజు అది నెరవేరుతుందనడానికి ఇది ఓ ఉదాహరణ. విజయం తర్వాత మా మూమెంట్స్ అన్ని ఆ సమయానికి ఉన్న ఎమోషన్సే. మా కల నిజమైంది. ఈ పిచ్ మాకు ట్రోఫీ అందించింది. ఈ గ్రౌండ్ నాకు జీవితంకాలం గుర్తుంటుంది. అందుకే పిచ్‌పై ఉన్న గడ్డిని నోట్లో వేసుకున్నా. అంతేకానీ, అలా చేయాలని ఏది కూడా ముందుగా అనుకున్నది కాదు' అని రోహిత్ అన్నాడు.
💬💬 𝙄𝙩 𝙝𝙖𝙨𝙣'𝙩 𝙨𝙪𝙣𝙠 𝙞𝙣 𝙮𝙚𝙩
— BCCI (@BCCI) July 2, 2024
The celebrations, the winning gesture and what it all means 🏆
Captain Rohit Sharma takes us through the surreal emotions after #TeamIndia's T20 World Cup Triumph 👌👌 - By @Moulinparikh @ImRo45 | #T20WorldCup pic.twitter.com/oQbyD8rvij
గ్రాండ్ వెల్కమ్: 11ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా బుధవారం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. బర్బడోస్లో వాతావరణం కాస్త మెరుగవడం వల్ల టీమ్ఇండియా ప్లేయర్లు స్పెషల్ ఫ్లైట్‌లో స్వదేశానికి రానున్నారు. వారికి దిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ప్లేయర్లంతా ఇప్పటికే భారత్‌కు రావాల్సి ఉంది. అయితే అక్కడ తుపాన్ కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో టీమ్ఇండియా స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యింది.
'ఆ ఫోన్ చేసినందుకు థాంక్స్- ఇదంతా నీ వల్లే రోహిత్!'
టీ20కు రిటైర్మెంట్ - మరి కోహ్లీ, రోహిత్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? - Kohli Rohith T20 Retirement