ETV Bharat / sports

'టెస్టుల్లో 400 బాదే సత్తా వారికే ఉంది'- రోహిత్ విరాట్ కాదట! - Brian Lara Test Records - BRIAN LARA TEST RECORDS

Brian Lara Test Records: వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా తన టెస్టు రికార్డులను బద్దలుకొట్టగల సత్తా టీమ్ఇండియాలో ఇద్దరు ప్లేయర్లకే ఉందని అన్నాడు. మరి ఆ ఇద్దరు ఎవరంటే?

Brian Lara Test Records
Brian Lara Test Records (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 6:55 AM IST

Updated : Jul 10, 2024, 7:39 AM IST

Brian Lara Test Records: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియన్ లారా తన టెస్టు ఫార్మాట్ రికార్డులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. లారా 2004లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్​లో 400 పరుగులు బాది వరల్డ్​ రికార్డు సృష్టించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ రికార్డు లారా పేరిటే ఉంది. అయితే తన రికార్డులు త్వరలో బ్రేక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని లారా అన్నాడు. ఈతరం యంగ్ ప్లేయర్ల అగ్రెసివ్ క్రికెట్​తో తన రికార్డులు బద్దలవడం సాధ్యమేనని తాజాగా పాల్గొన్న ఓ పాడ్​కాస్ట్​లో పేర్కొన్నాడు. అయితే టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు శుభ్​మన్ గిల్, యశస్వీ జైశ్వాల్​కు తన టెస్టు రికార్డులు బ్రేక్ చేసే సత్తా ఉందని లారా అభిప్రాయపడ్డాడు.

'వివ్ రిచర్డ్స్, గార్డన్ గ్రీన్డేలాండి అగ్రెసివ్ బ్యాటర్లున్న 1970, 80ల్లో సర్ గార్ఫిల్డ్ సోబర్స్ 365 రికార్డు బ్రేక్ అవ్వలేదు. కానీ, మా తరం నాటికి టెస్టుల్లో వీరెంద్ర సేహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజామమ్ ఉల్ హక్, సనత్ జయసూర్య ఈజీగా 300 పరుగులు బాదేశారు. అలాగే ఈ తరం కుర్రాళ్లు కూడా అనేక రికార్డులు బ్రేక్ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఏదైనా అగ్రెసివ్ క్రికెట్​తోనే ఇది సాధ్యమవుతుంది. టీమ్ఇండియాలో గిల్, జైశ్వాల్ ఇంగ్లాండ్​లో జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్ ప్రస్తుతం అలా అగ్రెసివ్ క్రికెట్ ఆడే ప్లేయర్లే. వారికి పరిస్థితి అనుకూలిస్తే, భవిష్యత్​లో కచ్చితంగా ఈ రికార్డులను బద్దలుకొడతారు' అని లారా అన్నాడు.

ఆ రికార్డూ లారా పేరిటే! అయితే లారా అనగానే అందరికీ టెస్టుల్లో 400 పరుగుల ఇన్నింగ్సే గుర్తుంటుంది. అయితే ఇదే కాకుండా లారా ఖాతాలో మరో వరల్డ్ రికార్డూ ఉంది. 1994లో బ్రియన్ లారా ఫస్ట్ క్లాస్ క్రికెట్​ చరిత్రలోనే అత్యధిక స్కోర్ బాది రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో వార్విక్​షైర్ తరపున ప్రాతినిధ్యం వహించిన లారా డుర్హమ్​పై 501 పరుగులు బాది ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్​తో అప్పటిదాకా హనీఫ్ మహ్మద్ (499 పరుగులు) పేరిట ఉన్న రికార్డ్​ను బద్దలుకొట్టాడు.

విండీస్​ గెలుపుపై రియాక్షన్​ - స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్​ లారా

కొత్త కోచ్​ వేటలో సన్​రైజర్స్​.. బ్రియన్​ లారాకు బైబై.. అతడిపై ఆసక్తి!

Last Updated : Jul 10, 2024, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.