ETV Bharat / sports

అకాయ్ పుట్టాక ఫస్ట్ టైమ్​ అనుష్క అలా! - Anushka Sharma RCB - ANUSHKA SHARMA RCB

Anushka Sharma RCB : అకాయ్ పుట్టిన తర్వాత ఎక్కడా కనిపించని స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, తాజాగా చిన్నస్వామి స్టేడియంలో సందడి చేసింది. ఆర్సీబీ మ్యాచ్​లో తన భర్త విరాట్​కు సపోర్ట్ చేస్తూ అందరిలో జోష్ నింపింది.

Anushka Sharma RCB
Anushka Sharma (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 10:45 AM IST

Anushka Sharma RCB : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ శనివారం చిన్నస్వామీ స్టేడియంలో సందడి చేసింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఆ తర్వాత తన కుమారుడు అకాయ్​కు జన్మనిచ్చేందుకు లండన్​కు వెళ్లింది. అక్కడ కొంత కాలంపాటు ఉండి, తాజాగా ఇండియాకు తిరిగివచ్చింది. అయితే ఇండియా వచ్చాక కూడా అంతగా బయట ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా గుజరాత్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్​కు అనుష్క హాజరైంది. స్టాండ్స్​లో కూర్చుని తన భర్త విరాట్ కోహ్లీ అలాగే బెంగళూరు టీమ్​కు సపోర్ట్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతోంది. తన భర్త ఆడుతున్న సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్​ప్రెషన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అకాయ్ పుట్టిన తర్వాత ఇది ఆమె మొదటి పబ్లిక్ అప్పియరెన్స్. కానీ అంతకంటే ముందు ఆమె ఆమె తన పుట్టినరోజు వేడుకల్లో కనిపించి ఆకట్టుంది. ఆ పార్టీకీ అనుష్కతో పాటు విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్​వెల్​ దంపతులు హాజరై సందడి చేశాడు. బెంగళూరులోని ఓ రెస్టారెంట్​లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగనట్లు తెలుస్తోంది. ఇక ఆ మూమెంట్స్​ను సోషల్ మీడియా వేదికగా విరాట్​, అనుష్కతో పాటు డుప్లెసిస్​ కూడా నెట్టింట షేర్ చేశారు.

ఇక విరాట్ తాజాగా అనుష్క బర్త్​డే రోజు షేర్ చేసిన పోస్ట్​ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నా జీవితానికి నువ్వు ఓ వెలుగువి. హ్యాపీ బర్త్​డే" అంటూ స్పెషల్ విషెస్ తెలిపాడు. అనుష్కతో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్​కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసి ఎమోషనలయ్యాడు.

ఇక స్టార్ క్రికెటర్​గా ఫామ్​లో ఉన్న సమయంలో విరాట్ అనుష్క మధ్య ప్రేమ చిగురించింది. ఓ షాంపూ యాడ్​లో భాగమైన ఈ జంట అప్పటి పరిచయాన్ని క్రమక్రమంగా ప్రేమగా మలుచుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017లో ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా విరాట్- అనుష్క​ ఒక్కటయ్యారు. అప్పట్లో ఈ పెళ్లి ట్రెండ్ సెట్​ చేసి అనేక సెలబ్రిటీ పెళ్లిల్లకు థీమ్​గా మారింది. ఇక ఈ జంట 2021లో వామిక అనే పాపకు తల్లిదండ్రులయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో అకాయ్ అనే కుమారుడికి జన్మనిచ్చింది. అనుష్క శర్మ. అయితే ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్​ను స్పెండ్ చేస్తోంది. త్వరలో చక్దా ఎక్స్​ప్రెస్​ అనే సినిమాతో అభిమానులను ముందుకు రానుంది.

స్క్రీన్​కు దూరమై ఆరేళ్లైనా క్రేజ్ అస్సలు తగ్గలే - షారుక్​,సల్మాన్​లనే మించేసిందిగా - Happy Birthday Anushka Sharma

ఇండియాకు తిరిగొచ్చిన అనుష్క శర్మ, అకాయ్‌ - Kohli Son

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.