ETV Bharat / spiritual

ఈ వారంలో ఆ రాశుల వారికి ప్రమోషన్ పక్కా- వ్యాపారులు అప్రమత్తంగా ఉంటే మేలు! - Weekly Horoscope

Weekly Horoscope From 7th July to 13th July 2024 : 2024 జులై​ 7వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:11 AM IST

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From 7th July to 13th July 2024 : 2024 జులై​ 7వ తేదీ నుంచి జులై 13వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రథమార్ధంలో అన్ని రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహచరుల సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాల హడావిడి ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఊహించని ధనలాభం ఉండవచ్చు. వ్యాపారంలో పోటీ, సవాళ్లు ఉండవచ్చు సంయమనం అవసరం. ఉద్యోగంలో మహిళలు అదనపు సవాళ్లను ఎదుర్కోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోజువారీ పనులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించుకుంటే సమస్యలు ఉండవు. విదేశాలలో కెరీర్ కోసం ప్రయత్నించే వారికి ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి గడ్డుకాలం నడుస్తోంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనాలు లేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి వారం ప్రథమార్ధంలో ప్రతికూలతలు ఉండవచ్చు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగస్థులు కెరీర్​లో స్థిరత్వం కోసం శ్రమించాలి. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు అందుకోడానికి మరికొంత సమయం పట్టవచ్చు. వారం ద్వితీయార్ధంలో ఉద్యోగులు సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. సన్నిహితుల మధ్య అపార్థాలు అనుమానాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆర్థికంగా గడ్డుకాలం. మెరుగైన ఫలితాల కోసం ఆంజనేయ స్వామిని ప్రార్ధించండి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు గత కొంత కాలంగా పనిచేస్తున్న ప్రాజెక్టు అత్యుత్తమంగా పూర్తవుతుంది. గొప్ప వ్యక్తుల సహకారంతో ఈ విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నతాధికారుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. మీ విజయాలకు అసూయపడే సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భూమి, భవనాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన శుభ వార్తలను అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు సన్నిహితుల సలహాలు పాటిస్తే మంచిది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొదలు పెట్టిన అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. పదోన్నతి, బదిలీ వంటి శుభ ఫలితాలు ఉంటాయి. భూమి, భవనాల క్రయ విక్రయాలు లాభాన్ని అందిస్తాయి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. లాభాల కోసం ప్రమాదకరమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. భవిష్యత్తులో డబ్బును కోల్పోవచ్చు అప్రమత్తంగా ఉంటే మేలు. విదేశాలలో వృత్తిని వ్యాపారాలు ప్రారంభించాలని ఆశించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు. ఒక స్త్రీ కారణంగా ఈ రోజు మీ జీవితమే మారిపోతుంది. గురు శ్లోకాలు పఠిస్తే శుభం జరుగుతుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పనిపై ప్రభావాన్ని చూపుతాయి. అన్ని రంగాల వారికి పనుల్లో ఆలస్యం, పొరపాట్లు వంటివి జరుగుతాయి. చేసిన పనే మళ్లీ చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారు చేతికి అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు. ఒక చిన్న పొరపాటు మీ ప్రతిష్టను నాశనం చేస్తుంది. ప్రత్యర్థుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి, భూ సంబంధ వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. లేకుంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్య ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని వృద్ధి చేసి విజయం సాధిస్తారు. మార్కెట్‌లో మీ విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి వారం చివరలో పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వివాదాలలో కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు సమస్యను కోర్టు వెలుపల రాజీ మార్గంలో పరిష్కరించుకునే మంచిది. సోదర వర్గంతో గొడవలు మానసిక అశాంతికి కారణమవుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో సమస్యలు ఉండవచ్చు. సహోద్యోగుల వ్యాఖ్యలపై స్పందించడం కంటే వాటిని విస్మరించడం మంచిది. వ్యాపార వర్గం వారికి ఈ వారం చివరి భాగంలో అనవసర ప్రయాణాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ జనకంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధ్యానంతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దైవబలంతో కార్యసిద్ధి, లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కాగితాలు అందుకుంటారు. జీతం పెరుగుదల కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్ధులు పనిలో ఆటంకాలు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తీవ్రమైన శ్రమతో మాత్రమే విజయాన్ని అందుకోగలరు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి తీర్ధ యాత్రలకు వెళతారు. హనుమ ఆలయ సందర్శన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించున్నట్లైతే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్థిక లాభాలను పొందవచ్చు. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వర్కింగ్ మహిళలు వృత్తి పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండవచ్చు. అభయ ఆంజనేయస్వామి దర్శనంతో ఆపదలు తొలగుతాయి.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రతిపనిలోను తొందర, పరుగులు ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాధ్యతలు, కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమతోనే ఆశించిన ఫలితాలు అందుకోగలరు. ఇంటి మరమ్మత్తు పనులకు సంబంధించి అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. ఉద్యోగులపై అకస్మాత్తుగా పనిభారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మనోబలం పెరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. సోమరితనం, మితిమీరిన గర్వం కారణంగా పనిలో నిర్లక్ష్య వైఖరితో మొదటికే మోసం తెస్తుంది. బద్ధకం వీడితే మంచిది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మంచి అవకాశాలు రావాలంటే అణుకువగా ఉండడం అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. లేకుంటే భారీ నష్టాలు ఉండవచ్చు. ఆస్తి వివాదాల విషయంలో కోర్టుకు వెళ్లడం కంటే, సామరస్యపూర్వక చర్చల ద్వారా పరిష్కరించడం ఉత్తమం. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా లేదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో చోర భయం ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. పంచముఖ హనుమ దర్శనంతో ఆపదలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వారం ప్రథమార్ధంలో పట్టుదలతో శ్రమించి తమ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు అప్పగించకుండా పూర్తి చేస్తేనే మంచిది. లేదంటే ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు వారం ద్వితీయార్ధం శుభప్రదంగా ఉంటుంది. లాభాల పంట పండుతుంది. వ్యాపారాన్ని బ్రహ్మాండంగా విస్తరిస్తారు. సంపద గణనీయంగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు దొరుకుతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.