Tirumala Pushkarini Closed: శ్రీనివాసుడు నెలవైన తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి అష్ఠైశ‌్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసం. అయితే శ్రీవారి ఆలయం వద్దగల పుష్కరిణి నీటిని పూర్తిగా తొలగించి మరమ్మతుల చేసేందుకు వీలుగా నెల రోజుల పాటు మూసివేశారు. సివిల్ వర్క్స్ చేసేందుకే పుష్కరిణి తాత్కాలికంగా మూసివేశామని ఆలయ అధికారలు తెలిపారు. ఈ కారణంగానే ఈ నెల రోజుల పాటు పుష్కరిణి హారతి కూడా ఉండదు.
శ్రీవారిని దగ్గరగా దర్శించుకునే అవకాశమివ్వండి
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు వీలుగా అత్యుత్తమ రీసైక్లింగ్ టెక్నాలజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ గత కొంత కాలంగా నిరంతరాయంగా రీసైక్లింగ్ ప్రక్రియ చేస్తున్నా సాంకేతికత ఇబ్బందులు, శుద్ధి ప్రక్రియలో సమస్యలు వస్తున్నాయి. పుష్కరిణికి చిన్న చిన్న సిమెంట్ పనులు చేయాల్సి ఉంది.
సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంచిన టీటీడీ
పుష్కరిణి మరమ్మతులలో భాగంగా మొదటి పదిరోజులు నీటిని పూర్తిగా తొలగిస్తారు. అటు తర్వాత పది రోజుల పాటు మరమ్మతులతో పాటు కలర్స్ వేస్తారు. చివరి పదిరోజులు నీటిని పూర్తిగా నింపి పుష్కరిణి సిద్ధం చేస్తారు. నీటిలో ఉండే పీహెచ్ విలువను కూడా లెక్కిస్తారు. పుష్కరిణిలో ఎప్పుడూ 7వరకు మాత్రమే పీహెచ్ శాతం ఉండేలా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం పర్యవేక్షిస్తుంది.
ఆగస్టు తిరుమలలో విశేష ఉత్సవాలు
- ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం.
- ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
- ఆగస్టు 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ
- ఆగస్టు 10న కల్కి జయంతి
- ఆగస్టు 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి
- ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి
- ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
- ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం. నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం
- ఆగస్టు 19న శ్రావణపౌర్ణమి. పౌర్ణమి గరుడ సేవ. రాఖీ పండుగ. హయగ్రీవ జయంతి. విఖనస మహాముని జయంతి
- ఆగస్టు 20నతిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ జపం
- ఆగస్టు 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం
- ఆగస్టు 28న శ్రీవారి శిక్యోత్సవం