ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్! శని ధ్యానం మేలు! - Daily Horoscope

Horoscope Today July 9th 2024 : జులై​ 9న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 5:00 AM IST

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today July 9th 2024 : జులై​ 9న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వృత్తివ్యాపారాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సూర్య ఆరాధనతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు ఈ రోజు ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండడం అవసరం. సమయానుకూలంగా నడుచుకోండి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఒత్తిడి, అపార్థాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అనవసరమైన వివాదాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికి రాదు. ఆచరణాత్మకంగా ఉంటే మేలు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. సుబ్రమణ్య స్వామిని ఆరాధిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహసంచారం శుభకరంగా ఉంది అందుకే సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి, బదిలీ అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహం ఈ రోజు మీకు నిరాశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన కృషితోనే విజయం లభిస్తుంది. ఉగ్యోగులకు పనులు మెల్లగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేస్తే మంచిది. సన్నిహితులతో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎవరితోనైనా వాదించడం మానుకోండి. ప్రత్యేకంగా బంధువులు, ఇరుగుపొరుగు వారితో స్నేహపూర్వకంగా ఉంటే మంచిది. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లాభం, శత్రు జయం ఇలా ఎటు చూసినా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్థిక ప్రయోజనాలు వంటి శుభఫలితాలతో రోజంతా ఆనందంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి వృత్తి వ్యాపారాలలో అద్భుతాలు చేస్తాయి. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. ఉద్యోగులు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటే విజయపథంలో దూసుకెళ్తారు. సంపద పెరుగుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపార రంగాల వారు అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. దైవబలంతో అన్ని పనులు పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశముంది జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. శని ధ్యానం మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ అనుగ్రహించబడతాయి. ఈ సంతోషాన్ని సంపూర్ణంగా ఆనందించండి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకు మంచి రోజు. ఈ రోజు ఏ పని చేసినా విజయం, ఆర్థిక లాభాలు వెన్నంటే ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నష్టాలను తీసుకు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. చేసే పనిలో స్పష్టత లేనందున పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. ఉద్యోగులు పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సామాజిక సేవా రంగంలో ఉండే వారికి గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. దుర్గా దేవి ధ్యానంతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.