ETV Bharat / spiritual

ఆ రాశివారు నేడు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది! - DAILY HOROSCOPE IN TELUGU

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 7:09 AM IST

Horoscope Today July 28th 2024 : జులై​ 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 28th 2024
Horoscope Today July 28th 2024 (ETV Bharat)

Horoscope Today July 28th 2024 : జులై​ 28న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు తమ తమ రంగాలలో తొందరపాటు ధోరణితో ఉండడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. స్థిరాస్తి రంగం వారు నూతన వెంచర్లు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందడుగు వేస్తేనే విజయం లభిస్తుంది. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రతికూలతలు ఎదురైనా సమర్ధవంతంగా అధిగమిస్తారు. కోపాన్ని తగ్గించుకొని నిగ్రహం పాటించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. గణపతి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ రోజు విశేషమైన ఆర్ధిక ప్రయోజనాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతులు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా మీ ప్రయాణం ఉంటుంది. సామాజిక సేవా, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో తీర్థయాత్రకి ప్రణాళిక వేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశాల్లో నివసించే బంధువుల నించి అందిన వార్తల వలన మనస్తాపం కలుగుతుంది. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆర్ధిక నష్టాలు సంభవించవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కకన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిత్వాన్నిప్రతిబింబించేలా మీ చర్యలు ఉంటాయి కాబట్టి ముఖ్యులతో ఆచి తూచి వ్యవహరించండి. ఇతరులు మీ గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వొద్దు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ప్రశాంతంగా ఉండండి. ప్రియమైన వారి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. అదృష్టం అవకాశాల రూపంలో ఎదురవుతాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన దానికన్నా గొప్ప విజయాలు ఉంటాయి. ఆర్ధికంగా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఎలాంటి సమస్యలు లేకుండా సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. మీ పోటీదారులు తమ ఓటమిని అంగీకరిస్తారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు, అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీస్థాయిలో నష్టాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళను ఆత్మ విశ్వాసంతో అధిగమిస్తారు. కుటుంబ సమస్యలతో ఆందోళనగా ఉంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని సంఘటనల కారణంగా ప్రతిష్ఠకు భంగం కలగవచ్చు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల గందరగోళానికి గురవుతారు. సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో అనుకోని సవాళ్లు ఎదురుకావడంతో ఒత్తిడికి లోనవుతారు. మీ పరుషమైన మాటలతో సన్నిహితులను ఇబ్బంది పెడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.