ETV Bharat / spiritual

ఆ రాశి వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్​- వ్యాపారం బాగా రాణిస్తుంది - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 4:32 AM IST

Horoscope Today July 25th 2024 : జులై​ 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today July 25th 2024
Horoscope Today July 25th 2024 (ETV Bharat)

Horoscope Today July 25th 2024 : జులై​ 25న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరంగా, ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నవారికి శుభసమయం నడుస్తోంది. అవివాహితులకు కల్యాణఘడియలు సమీపించాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్థులకు వ్యాపారపరంగా అద్భుతమైన రోజు. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగస్థులకు విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. గొప్ప పేరు, ప్రఖ్యాతలతో పాటు సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్థులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలతో సంబంధాలు చెడగొట్టుకోవడం మంచిది కాదు. రాజీధోరణి అవలంబిస్తే మేలు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు తమ తమ రంగాలలో విజయం సాధించాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఏది సులభంగా దొరకదన్న వాస్తవాన్ని గుర్తిస్తే మేలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. మీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ పరుషంగా మాట్లాడకండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసికంగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో విహారయాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. స్థిరాస్తి రంగం వారు నూతన వెంచర్లు మొదలు పెడతారు. వృత్తి నిపుణులు విదేశాల వారితో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు విశేషంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఎటు చూసినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. పదోన్నతులు, కోరుకున్న చోటికి బదిలీలు వంటి ప్రయోజనాలు ఉంటాయి. వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలు సాహిత్య చర్చల్లో, వాదనల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మీ విశ్లేషణ, సృజనాత్మక సామర్ధ్యాలకు మెరుగు పరచుకోవచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి శ్రమకు తగిన ఫలం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగంలో కొనుగోలు, అమ్మకాలు జోరందుకుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు గొప్ప లాభాలను అందుకుంటారు. శివారాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో మొండి పట్టుదలకు పొతే తరువాత చింతించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి ఏ విషయంలోనైనా పట్టు విడుపు ధోరణితో ఉంటే మంచిది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు మొహమాటాలు పోతే మొదటికే మోసం వస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలం ఉంటుంది. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు క్లిష్టంగా ఉంటాయి. సమస్యల పరిష్కారానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. బుద్ధిబలంతో సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపారంలో ఆర్ధికంగా నష్ట పోవచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. వృత్తి పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను సరైన మార్గంలో వినియోగిస్తే లక్ష్యాన్ని చేరుకోగలరు. వ్యాపారంలో విజయాలను సొంతం చేసుకుంటారు. ధ్యానం, యోగా సాధన చేయడం ద్వారా ప్రశాంతత పొందవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలకు అవకాశం ఉంది. సంయమనంతో వ్యవహరిస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కార్యసిద్ధి హనుమాన్ ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.