ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశుల వారికి ప్రయాణాల్లో ఆటంకాలు! సూర్య ఆరాధన శ్రేయస్కరం! - Daily Horoscope

Horoscope Today July 10th 2024 : జులై​ 10న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 5:00 AM IST

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

Horoscope Today July 10th 2024 : జులై​ 10న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మంచి శుభ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఇలాంటి రోజుల కోసమే కదా ఇన్నాళ్లు శ్రమించింది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నూతనోత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు, సహచరుల సహకాకారం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపారులు గొప్ప ఆత్మ విశ్వాసం, నీతి నిజాయితితో పనిచేసి మంచి పేరు, తిరుగులేని విజయాలను సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టటానికి శుభసమయం. ప్రభుత్వ పరంగా అనుమతులు, రుణాలు సులభంగా అందుతాయి. చేపట్టిన ప్రతి పనిలోను పురోగతి, లాభాలు పొందుతారు. ఉద్యోగులు పట్టుదల వదలకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసిపై అధికారులు ప్రశంసలు పొందుతారు. సన్నిహితులతో, ఇరుగుపొరుగువారితో గొడవలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలతో మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు సాధించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల కీలక విషయాలలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తిని పొందుతారు. సమాజంలో కీరి ప్రతిష్టలు పెరుగుతాయి. మోసపు మాటలతో తప్పుదోవ పట్టించే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఓర్పే మీకు శ్రీరామరక్ష. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వేసే ప్రతీ అడుగు, చేసే ప్రతిపని శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసి తిరుగులేని విజయాలను అందుకుంటారు. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది. కార్యసిద్ధి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగత జీవితంలో అనేక శుభ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి సౌభాగ్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి శుభసమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయసిద్ధి ఉంటుంది. మీ ప్రయత్నాలకు దైవబలం సహకరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోడానికి శుభసమయం. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు విశేషమైన కృషితో ఉన్నత పదవులను పొందుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదురైనా మనోబలంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో ఆత్మీయుల సలహా పాటించండి. అనవసర వివాదాల జోలికి పోవద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంగా పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబ సభ్యులు సలహా తీసుకోండి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. శ్రీరామనామ జపం శక్తినిస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే పెద్దలు సూచించిన మార్గంలో నడవడం ఉత్తమం. సంపద పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు తరచూ ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.