ETV Bharat / politics

బుడమేరు నదంట - జగన్‌ మాటలకు నవ్వుకుంటున్న జనం - సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదుగా - TROLLS ON YS JAGAN COMMENTS - TROLLS ON YS JAGAN COMMENTS

TROLLS ON YS JAGAN COMMENTS : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఇంకా తీరుమారలేదని మండిపడుతున్నారు. ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తూ, అమరావతిపై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అదే విధంగా బుడమేరుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.

TROLLS ON YS JAGAN COMMENTS
TROLLS ON YS JAGAN COMMENTS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:48 AM IST

Updated : Sep 5, 2024, 10:27 AM IST

TROLLS ON YS JAGAN COMMENTS: కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరుకు నీటిని విడుదల చేశారంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మామూలుగా లేవు. ఇదెక్కడి లాజిక్ జగనన్నా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకెంత కాలం ఇలా ఫ్యేక్ ప్రచారాలతో గడిపేస్తారంటూ మరికొంతమంది మండిపడుతున్నారు.

ఎక్కడ బుడమేరు - ఎక్కడ చంద్రబాబు ఇల్లు: ‘బుడమేరు నది.. ఆ నదిపైనున్న రెగ్యులేటర్‌ 11 గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది. అందుకే రాత్రికి రాత్రే ఎత్తేశారు. దీంతో వరద వచ్చింది’.. ఇవన్నీ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వరద బాధితులను పరామర్శించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు. ఇది విన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నా ఆరోపణల్లో అసత్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించడంతో మరింత విస్తుపోయారు. ‘ఎక్కడ బుడమేరు, ఎక్కడ కృష్ణా! బుడమేరు నది కాదు.. వాగు, ఓ డ్రెయిన్‌! కృష్ణా జీవ నది, డ్రెయిన్‌లో నీరు నదిలో పడితే.. సీఎం చంద్రబాబు ఇల్లు ఎలా మునుగుతుందో మరి’.. అని జగన్‌ మాటలకు జనం నవ్వుకుంటున్నారు.

కరకట్టపై చంద్రబాబు ఇంటిని రక్షించేందుకే విజయవాడలోని ఈ ప్రాంతాన్ని నీటిమయం చేశారని, తాను ప్రతి ప్రశ్న లాజికల్‌గా అడుగుతున్నానంటూ గొప్పగా చెప్పుకుచ్చారు. కృష్ణా నదికి గరిష్ఠంగా 11.43 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. బుడమేరుకు వచ్చిన వరద కేవలం 35 వేల క్యూసెక్కులే. అంటే 35 వేల క్యూసెక్కులను ఆపితే కృష్ణా నదికి వచ్చే వరదంతా ఆగిపోతుందా? ఇదేం లాజిక్ జగనన్నా అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.

అమరావతిపై ఫేక్ న్యూస్ నమ్మెద్దు- అదంతా పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్ల దుష్ప్రచారం : మంత్రి నిమ్మల - Minister Rama NAidu Interview

రాజధాని అమరావతిపై విషం చిమ్మూతూ: మరోవైపు రాజధాని అమరావతిపై కూడా పలువురు విషం చిమ్ముతున్నారు. రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయానికి వరద ముప్పు లేదు, ఎమ్మెల్యే, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాల వద్ద కూడా పరిస్థితి అంతా బాగానే ఉంది. వచ్చిన వరద కొండవీటివాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి వెళ్లిపోతోంది. అయినా కూడా కొందరు పనిగట్టుకుని రాజధాని అమరావతిపై విషం చిమ్ముతున్నారు. వర్షం కురిసినప్పుడు సాధారణంగా గంట, రెండు గంటల పాటు నిలిచే నీటిని చూపిస్తూ అమరావతి మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాలలో ఫేక్‌ వార్తలను ప్రచారం చేస్తున్నారు.

రాజధాని పరిస్థితిపై ‘ఈనాడు - ఈటీవీ భారత్’ ప్రతినిధులు సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించగా, ఈ వార్తలన్నీ నకిలీవేనని తెలిసింది. గుంటూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ ప్రాంతంలో రెండు రోజుల్లో 42 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ఒక దశలో గంటకు 6 సెంటీ మీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. అయినా కూడా వరద ముప్పు ఏమాత్రం లేకుండా సోమవారం ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరిగింది. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న ప్రచారం నకిలీదేనని దీనిని బట్టే అర్థమవుతోంది.

ఇదే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు సైతం స్పష్టం చేశారు. అమరావతి ముంపు ప్రాంతమనే జగన్‌ కలను సాకారం చేసేందుకు కొంతమంది కృషిచేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్‌ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 11.5లక్షల క్యూసెక్కుల నీరు పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదన్న నిమ్మల, అమరావతిపై ఫేక్‌ న్యూస్‌ ఎవరూ నమ్మొద్దని సూచించారు. అమరావతిపై విషం చిమ్మడం వైఎస్సార్సీపీకి మొదట్నుంచీ అలవాటే అని, రాజధానికి ఎలాంటి ప్రమాదమూ లేదన్నారు.

జగన్​? ఇదేనా నీ టీం పనితీరు - వెలుగులోకి రోజుకో నాయకుడి లీలలు - Jagan team obscene activities

Last Updated : Sep 5, 2024, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.