ETV Bharat / politics

వైఎస్సార్సీపీ 9వ జాబితా విడుదల - మంగళగిరి సమన్వయకర్తలతో దాగుడుమూతలు - Mangalagiri YCP candidate Lavanya

YSRCP Released 9th List: సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న వైఎస్సార్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 9వ జాబితాను విడుదల చేసింది. కాగా ఈ సారి ఎవ్వరూ ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ అధికార పార్టీలో చేరారు.

YSRCP Released 9th List
YSRCP Released 9th List
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 10:41 PM IST

YSRCP Released 9th List : త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న వైఎస్సార్సీపీ ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేసింది. తాజాగా 9వ జాబితాను విడుదల చేసింది. కాగా ఈ సారి ఎవ్వరూ ఊహించని సమన్వయకర్తల పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుత జాబితాలో కేవలం మూడు స్థానాలకే లిస్ట్​ను రిలీజ్ చేశారు.

మంగళగిరి ఇంచార్జ్​గా ఉన్న గంజి చిరంజీవిని తొలగించి మురుగుడు లావణ్యను, మూడు రోజుల క్రితం ఐఎఎస్​కు స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్​ను కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అలాగే నెల్లూరు పార్లమెంటరీ సమన్వయకర్తగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించింది వైఎస్సార్సీపీ అధిష్టానం.

అభ్యర్థుల మార్పుపై 24 గంటల్లోనే మాట మార్చిన జగన్‌- 5నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల మార్పు

మురుగుడు లావణ్య : మంగళగిరి నుంచి టీడీపీ నేత నారా లోకేశ్ పోటీ చేస్తుండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ రకరకాల ఎత్తులు వేస్తున్నారు. మంగళగిరి ఇన్​ ఛార్జ్​లను మార్చుకుంటూ వస్తున్నారు. తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను పక్కన పెట్టిన సీఎం జగన్ టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని సమన్వయకర్తగా రెండు నెలల క్రితం ప్రకటించారు. దీంతో అసంతృప్తితో జగన్​కు గుడ్ బై చెప్పిన ఆర్కే, షర్మిల వెంట వెళ్లగా పార్టీ బలహీనపడటంతో ఆయన్ను బతిమలాడి తిరిగి పార్టీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు గంజి చిరంజీవికి సీఎం షాక్ ఇచ్చారు. ప్రస్తుత ఇన్ చార్జ్​గా ఉన్న గంజి చిరంజీవిని తొలగించి ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురైన మురుగుడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా సీఎం ప్రకటించారు.

తాడేపల్లిలో జగన్​ను కలిసిన మంగళగిరి వైఎస్సార్సీపీ నేతలు

చిరంజీవి గైర్హాజరు : ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలకు సీఎంవోకు పిలిపించారు. సీఎం జగన్​ను కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే కలిశారు. ఈ సమావేశానికి గంజి చిరంజీవి గైర్హాజరయ్యారు. మురుగుడు లావణ్యను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం జగన్, కలసి కట్టుగా పని చేసి ఆమెను గెలిపించాలని సీఎం ఆదేశించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై గంజి చిరంజీవి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయమై సందిగ్ధత నెలకొంది. ఇన్చార్జ్​ల మార్పులతో మంగళగిరి వైఎస్సార్సీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఎన్నికల కన్నా ముందే నెల్లూరులో వైసీపీ ఖాళీ !

ఇంతియాజ్ : మూడు రోజుల క్రితం సీసీఎల్​ఏ అదనపు కమిషనర్, సెర్ఫ్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ వైఎస్సార్సీపీలో చేరడానికి స్వచ్చంద ఉద్యోగ విరమణ చేశారు. ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 3 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నాన్ కేడర్ ఐఏఎస్​గా ఉన్న ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆలస్యం చేయకుండా సీఎం క్యాంపు కార్యాలయంలో ఇంతియాజ్‌కి కండువా కప్పి, సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. వెనువెంటనే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

వైఎస్సార్సీపీలోకి హరిరామజోగయ్య కుమారుడు : రాష్ట్ర కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు పవన్ అండగా నిలబడతారని, ఆ వర్గాలకు ప్రతినిధిగా ఉంటారని జనసేనలో పని చేశానని, వ్యక్తిగతంగా తన ఆశలన్నీ నిరాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ టికెట్, పదవి ఆశించకుండా షరతుల్లేకుండా వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీలోకి  హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.