ETV Bharat / politics

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే వినాశనం తప్పదని జనం తీర్పు - YSRCP Leaders Used Bad Words

YSRCP Ministers Used Bad Words Loss their MLA Seat : బూతులు మాట్లేడే వైఎస్సార్సీపీ నేతలకు ఓటరు మహాశ్రయులు తగిన బుద్ధి చెప్పారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్​, అంబటి రాంబాబు లాంటి వారిని ఇంటి బాట పట్టేలా చేశారు. రాజకీయ విమర్శ శ్రుతిమించితే జనం తీర్పు ఇలా ఉంటుందేమో!

AP Assembly Poll Results 2024
YSRCP Ministers Used Bad Words Loss their MLA Seat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 10:09 AM IST

నోటి మాటలకు ఓటు దెబ్బ - రాజకీయ విమర్శ శ్రుతిమించితే భరించలేమని జనం తీర్పు (ETV Bharat)

YSRCP Ministers Used Bad Words Loss their MLA Seat : వైఎస్సార్సీపీ బూతు నేతలకు పోలింగ్‌ బూత్‌ల్లోనే ఓటర్లు బుద్ధి చెప్పారు. పాడు నోళ్లకు ఓటమితోనే తాళం వేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్‌ యాదవ్‌, అంబటికి రాంబాబు వంటి నాయకుల్ని మరోసారి అసెంబ్లీకి రావొద్దని తీర్పు చెప్పారు.

Kodali Nani : కొన్ని లక్షల మంది ప్రతినిధిగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నామనే విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు కీలెరిగి వాతలు పెట్టారు. జగన్‌ను పొగడడం, విపక్షాలపై నోరుపారేసుకోవడం, దాడులు చేయడమే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పదవులకు ప్రమాణాలని కొత్త నిర్వచనాలు సూత్రీకరించిన నేతాగణాన్ని ఓటర్లు తరిమికొట్టారు. మైకు ముందుకొస్తే చెవులు మూసుకునే అసభ్య పదజాలాన్ని ప్రయోగించే కొడాలి నానిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు!

ఆసెంబ్లీలోనూ బూతులు మాట్లాడి చివరికి 'బూతుల మంత్రిగార బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకున్నారు! కొడాలి నానీ టీవీలో మాట్లాడుతున్నారంటే ఆ తిట్లు వినలేక టీవీ ఛానల్‌ మార్చాల్సిన పరిస్థితి. రాజకీయ విమర్శ శ్రుతి మించి, బూతుగా మారితే భరించలేరన్న నిజాన్ని గుడివాడ ప్రజలు నిరూపించారు.

విధ్వంసం- విద్వేషం! ఇవే వైఎస్సార్సీపీ ఓటమికి ప్రధాన కారణాలు - Reasons For YSRCP Defeat In AP

Vallabhaneni Vamsi : ఇక కొడాలి నాని దోస్త్ వల్లభనేని వంశీనీ గన్నవరం ఓటర్లు ఛీకొట్టారు. కన్నతల్లి లాంటి తెలుగుదేశంపై కత్తి గట్టి ఆ పార్టీ కార్యాలయంపై దాడులు చేయించి, రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబు భార్యపైనా ఆనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమన్నట్లు నిరంకుశంగా శాసించారు. చివరకు ఓటరు తీర్పు చూసి, గన్నవరం నుంచి పలాయనం చిత్తగించారు.
Jogi Ramesh : నిత్యం ఎవరో ఒకర్ని తిడితేగానీ నోటి తీట తీరని జోగి రమేశ్‌కూ ఓటమి తప్పలేదు. జగన్‌ దృష్టిలో ఎక్కడ వెనుకబడతానో అన్నట్లుగా సహచర మంత్రుల ముందే నోరు పారేసుకునో జోగి రమేశ్‌ ఈసారి కృష్ణా జిల్లా పెడన నుంచి పెనమలూరుకు మారారు. అక్కడి ప్రజలూ ఆయన్ను తిరస్కరించారు. అనుచరులను వెంటేసుకొని చంద్రబాబు ఇంటిపైకి దండయాత్రగా వెళ్లిన జోగికి జగన్ మంత్రి పదవి కానుకగా పడేశారు. కానీ పెనమలూరు ఓటర్లు మాత్రం ప్రజాస్వామ్యంలో తిట్లు, దాడులకు స్థానం లేదని తీర్చిచ్చారు.

జగన్‌ చేసిన పాపాలే చంద్రబాబు విజయానికి మెట్లు! - People Belief Towards Chandrababu
Minister Roja : ఇక తోటి ఆడవాళ్లూ అసహ్యించుకునే ప్రవర్తనతో చెలరేగిన మంత్రి రోజా తగిన మూల్యం చెల్లించుకున్నారు. మంత్రిననే మర్యాదమరచిపోయి, చిన్న,పెద్ద అనే తేడా లేకుండా నోరుపారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు.

Minister Anil Kumar : మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ నీటిపారుదలశాఖ మంత్రిగా కన్నా నోటి పారుదల శాఖ మంత్రిగానే జనాలకు గుర్తుండిపోయారు! అసెంబ్లీలోనే 'బుల్లెట్ దిగిందా? లేదా అంటూ ఆకు రౌడీలా ప్రవర‌్తించారు. ప్రతి పక్షాల పట్ల దుందుడుకుగా ప్రవర్తించిడం, 'దమ్ముంటే చూసుకుందామా' అంటూ చొక్కా చేతులు మడతపెట్టి బెదిరించిన వీడియోలు సామాన్యులను భయపెట్టాయి. వీరు ప్రజాప్రతి నిధులా? రౌడీలా అన్న ప్రశ్నకు జవాబే నరసరావుపేట ప్రజల ఓటుతో తమ తీర్పును ఇచ్చారు.

Minister Ambati Rambabu : గంట, అరగంట అంటూ మహిళ జీవితాలతో చెలగాటం ఆడే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావుకూ ఓటర్లు తగిన బుద్ధిచెప్పారు. ఇలాంటి వారా మన పాలకులు ఆంటూ ఓటమి రుచి చూపించారు. వైఎస్సార్సీపీలో మితిమీరిన అరాచక సామ్రాట్‌లనూ ఇంటికి పంపారు. వరుసలో నిలబడి ఓటేయాలని అన్నందుకు పోలింగ్ కేంద్రం వద్దే సామాన్యుడిపై దాడి చేసిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ దాష్టీకాన్ని మధ్యాహ్నం టీవీల్లో చూసిన ఓటర్లు సాయంత్రం కల్లా ఓటు రూపంలో తీర్పునిచ్చారు.

Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తానొక ప్రజాప్రతినిధిననే విషయాన్ని విస్మరించి ఏకంగా పోలింగ్ బూత్లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. అక్కడే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. పిన్నెల్లి ఆరాచకాలు భరించిన మాచర్ల ఓటర్లు అదనుచూసి వేటు వేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం - చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు రేవంత్​ అభినందనలు

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం - గతంలో కంటే జగన్‌కు తగ్గిన మెజారిటీ - Kadapa Election Results 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.