ETV Bharat / politics

మమ్మల్నే అడ్డుకుంటారా? పోలీసులపై విరుచుకుపడ్డ మంత్రి అమర్​నాథ్ - Minister Amarnath Fire on Police - MINISTER AMARNATH FIRE ON POLICE

YSRCP Minister Amarnath Fire on Gajuwaka Police: మంత్రి అమర్​నాథ్ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నామినేషన్‌ వేసేందుకు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి రావటంతో అమర్​నాథ్ అర గంట పాటు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులపై అమర్​నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

YSRCP_Minister_Amarnath_Fire_on_Gajuwaka_Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 1:45 PM IST

YSRCP Minister Amarnath Fire on Gajuwaka Police: మమ్మల్నే అడ్డుకుంటారా? ఎలాంటి యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టారంటూ మంత్రి అమర్​నాథ్ పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులపై విరుచుకుపడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలు విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా మంత్రి అమర్‍నాథ్ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

మమ్మల్నే అడ్డుకుంటారా? పోలీసులపై విరుచుకుపడ్డ మంత్రి అమర్​నాథ్

మంత్రి అమర్​నాథ్​కు ఝలక్​ - గవర్నర్​ బంగ్లాలో మీడియా సమావేశానికి అధికారులు నో

ముందస్తు నిర్ణయం మేరకు పల్లా శ్రీనివాసరావు నామపత్రాలు దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లగా నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు మంత్రి అమర్‍నాథ్, ఇతర నాయకులు అరగంట పాటు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఓ దశలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. ఇంతలోనే టీడీపీ అభ్యర్థి బయటకు రావడంతో అమర్‍నాథ్​తో పాటు మరో 10 మంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతల భేటీ - ఉమ్మడి ఎన్నికల వ్యూహంపై చర్చ - BJP Leaders Meet Chandrababu

నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి అమర్‍నాథ్ విధుల్లో ఉన్న ఏడీసీపీ, ఏసీపీ స్థాయి పోలీసు అధికారులపై విరుచుకుపడ్డారు. చివరకు పోలీసులు వారిని కార్యాలయం లోపల ఉన్న టెంట్‍ వరకు అనుమతించి, అక్కడ నుంచి ఐదుగురిని లోపలకు పంపించారు. అధికార పార్టీ నాయకుల్నే అడ్డుకుంటారా అని పలువురు కార్యకర్తలు తీవ్రస్థాయిలో నినదించడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు.

ఎన్నికల బరిలో ముఖ్యమంత్రుల వారసులు - వాళ్లు ఎవరో తెలుసా? - AP ELECTIONS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.