YSRCP Leader Attack on Father And Daughter in Rajamahendravaram : దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు, అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజల భూములు, ఇళ్ల స్థలాలను ఆక్రమించి అనేక ఇబ్బందులకు గురి చేశారు. తాజాగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగితే వారిపైనే దాడి చేసిన పరిస్థితి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వైఎస్సార్సీపీ నాయకుడి దాష్టీకం : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి, కుమార్తెపై వైఎస్సార్సీపీ నాయకుడు తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడు. విజయవాడ కుంచనపల్లికి చెందిన యువతి కాజా కావ్య శ్రీ ఈవెంట్స్ వ్యాఖ్యాతగా హైదరాబాదులో పని చేస్తుంది. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడైన నల్లూరి వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్‌తో కావ్య శ్రీకి పరిచయం ఉంది. అభిలాష్ తాను చేసే వ్యాపారానికి రూ. 3 లక్షలు అప్పుగా కావాలని కావ్య శ్రీని అడిగాడు. దీంతో ఆమె 2021లో అభిలాష్‌కు నగదు ఇచ్చింది. అప్పటి నుంచి వడ్డీ, అసలు ఇవ్వలేదు. తమ డబ్బులు చెల్లించమని పలుసార్లు అడిగితే 10 రోజులకు ఇస్తా, ఒక నెల రోజుల్లో తిరిగి ఇస్తానని మాయ మాటలు చెబుతూ వచ్చాడు.
డోన్‌లో రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నాయకులు - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Leaders Attack
నెట్టింట వీడియో వైరల్ : అభిలాష్ తీరుతో విసిగిపోయిన కావ్యశ్రీ ఆదివారం తండ్రి నాగరాజుతో కలిసి రాజమహేంద్రవరంలోని వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ అఖిలాష్ లేకపోవడంతో డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస్ డబ్బు కోసం ఇంటికే వస్తారా అంటూ తండ్రి, కుమార్తెలను తీవ్రంగా కొట్టాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ సంఘటనపై బాధితులు ప్రకాష్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా శ్రీనివాస్ అప్పటి ఎంపీ భరత్‌కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ పలు సెటిల్‌మెంట్లలో పాలు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS