ETV Bharat / politics

సమన్వయకర్తల మార్పుల విషయంలోనూ రివర్స్‌ - వైసీపీ అయిదో జాబితాలో మరిన్ని సిత్రాలు

YSRCP Fifth List for 2024 Elections: సుదీర్ఘ కసరత్తు అనంతరం 3 అసెంబ్లీ, 4 లోక్ సభ అభ్యర్థులతో 5వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. తిరుపతి లోక్‌సభకు తిరిగి గురుమూర్తినే నియమించిన వైసీపీ అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగంను నియమించారు. ఎంపీ మాధవికి ఎక్కడా సీటు ఇవ్వలేదు. నెల్లూరు నుంచి నరసరావుపేటకు అనిల్‌ను బదిలీ చేయగా, పదేళ్ల తర్వాత మరోసారి కాకినాడ లోక్‌సభ ఇన్‌ఛార్జిగా సునీల్​ను నియమించారు. మచిలీపట్నానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్‌ పేరును ప్రకటించారు.

ysrcp_fifth_list_for_2024_elections
ysrcp_fifth_list_for_2024_elections
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 7:03 AM IST

సమన్వయకర్తల మార్పుల విషయంలోనూ రివర్స్‌ - వైసీపీ అయిదో జాబితాలో మరిన్ని సిత్రాలు

YSRCP Fifth List for 2024 Elections: పాలనలో పార్టీలో రివర్స్‌ విధానాన్ని పాటిస్తున్న వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో చేసిన ప్రయోగాలనూ ఇప్పుడు రివర్స్‌ చేస్తోంది. తిరుపతి సిటింగ్‌ ఎంపీ గురుమూర్తిని ఈనెల 11న సత్యవేడు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు. సత్యవేడులో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలం వద్దంటున్నా ఆయన్ను తిరుపతి లోక్‌సభకు మార్చారు.

మంత్రి పెద్దిరెడ్డి కుట్ర చేసి తనను సత్యవేడు నుంచి బయటకు పంపారని ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేస్తూ అధినాయకత్వానికి ఝలక్‌ ఇచ్చారు. ఆ షాక్‌తో గురుమూర్తిని మళ్లీ తిరుపతి లోక్‌సభకే మారుస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. సత్యవేడులో శాసనసభ మాజీ ఉపసభాపతి కుతూహలమ్మ సోదరి కొడుకైన నూకతోటి రాజేష్‌ను నియమించారు.

అప్పుడు మాధవిని ఇప్పుడు మత్స్యలింగం: అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని కొద్దిరోజుల క్రితం అరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మార్చారు. ఆ తర్వాత ఆమె స్థానిక నేతలను కలిసి పార్టీని బలోపేతం చేసుకునేందుకు నిండు గర్భిణీ అయినప్పటికీ అరకు నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆమె స్థానికేతరురాలంటూ హుకూంపేట జెడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆయన వర్గీయులు ఆమె వాహనాన్ని అడ్డుకుని మరీ ఘెరావ్‌ చేశారు. తర్వాత వారం రోజుల్లో ఆమె ప్రసవించడంతో బయటకు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమెను పూర్తిగా పక్కన పెట్టారు. అరకులో ఆమెను తీవ్రంగా వ్యతిరేకించి ఇబ్బంది పెట్టిన జెడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగంనే ఇప్పుడు సమన్వయకర్తగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఇప్పుడు ఎంపీ మాధవి పరిస్థితి ఏంటనే విషయంలో స్పష్టత లేదు.

వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జుల ఐదో జాబితా విడుదల

కాకినాడ లోక్‌సభ సమన్వయకర్తగా చలమలశెట్టి సునీల్‌ను నియమించారు. 2014లో ఒకసారి ఆయన వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో టీడీపీ తరపున కాకినాడ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014 తర్వాత పదేళ్లకు ఇప్పుడు వైసీపీ మరోసారి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించింది. సునీల్‌ మొదటిసారి 2009 లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

నరసరావుపేట లోక్‌సభ సమన్వయకర్తగా అనిల్​కుమార్: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికీ రాజీనామా చేసి ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్‌ ఇచ్చారు. అక్కడ ఎవరిని అభ్యర్థిని పెట్టాలనే విషయంలో తర్జనభర్జనల తర్వాత నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ నరసరావుపేట లోక్‌సభ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్థానికులనే అభ్యర్థిగా బరిలోకి దించాలని పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఆ పార్టీ నేతలు మొదట్నించీ సీఎంను కోరుతున్నారు. కానీ, ఇప్పుడు స్థానికేతరుడైన అనిల్‌ను తీసుకువచ్చారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ను మచిలీపట్నం లోక్‌సభ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సైతం ఈ లోక్‌సభ సీటును ఆశించారు. ఆయన కుమారుడు కృష్ణమూర్తిని ఇప్పటికే మచిలీపట్నం అసెంబ్లీ నియోకజవర్గ సమన్వయకర్తగా నియమించడంతో నానికి లోక్‌సభ అవకాశం ఇవ్వలేదంటున్నారు.

సింహాద్రి రమేష్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర రావును ఖరారు చేశారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడే చంద్రశేఖర రావు. ఆయన క్యాన్సర్‌ వైద్యనిపుణుడుగా హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన్ను పార్టీనే పట్టుబట్టి ఒప్పించినట్లు తెలిసింది.

వైఎస్సార్సీపీ నాలుగో జాబితా- ఈసారి కరివేపాకులు కూడా ఎస్సీలే! వాళ్లకే ఇస్తే బలపడతారు-నిలబడతారనే భయమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.