ETV Bharat / politics

సీఎం జగన్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసుడు కాదు: షర్మిల - YS Sharmila allegations on Jagan

YS Sharmila Allegations on Jagan: జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వారసుడు కానీ కాదని షర్మిల తేల్చి చెప్పారు. వైఎస్‌ పాలనతో జగన్‌ పాలనకు పొంతనే లేదని ఆరోపించారు. భూతద్దం పెట్టి చూసినా సీఎం జగన్​లో ఆ ఆనవాళ్లు కనిపించవని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను కాపాడే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని షర్మిల మండిపడ్డారు.

YS Sharmila allegations on Jagan
YS Sharmila allegations on Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 3:04 PM IST

YS Sharmila Allegations on Jagan: వైఎస్‌ పాలనతో జగన్‌ పాలనకు పొంతనే లేదని ఏపీ పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల విమర్శించారు. భూతద్దం పెట్టి చూసినా ఆ ఆనవాళ్లు కనిపించవని చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడారు. షర్మిలతో పాటుగా వైఎస్ వివేక కుమార్తె సునీత కూడా ప్రచారంలో పాల్గోన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఎంపీ అవినాష్‌రెడ్డిని వెనకేసుకస్తున్నాడని ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ వారసుడు కానీ కాదని షర్మిల తేల్చి చెప్పారు. వైయస్ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని ఆక్షేపించారు. జగన్ పాలన అంతా హత్య రాజకీయాలతో నిండిపోయిందని షర్మిల ఆరోపించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను కాపాడే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని షర్మిల మండిపడ్డారు. జగన్ మేనిఫెస్టో అంటే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నాడు, మద్యనిషేధం అని హామీ ఇచ్చాడు, నిషేధం పక్కన పెట్టి ప్రభుత్వమే మద్యం ఆమ్ముతుందనీ షర్మిల విమర్శించారు.

మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై పంచ్​లు- హత్య రాజకీయాలు చేస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లంటూ ఎద్దేవా - Sharmila allegations on MLA and MP

జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన అని దుయపడ్డారు. సీబీఐ అవినాశ్ రెడ్డిని నిందితుడు అని చెప్పిందని షర్మిల గుర్తు చేశారు. సీబీఐ వివేకా హత్యకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిందని పేర్కొన్నారు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పిందని, అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడనీ ఆరోపించారు. న్యాయం కోసం పోరాటం ఒకవైపు, హంతకులు ఒక వైపు ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచన చేయాలనీ షర్మిల విజ్ఞప్తి చేశారు.

ఆడది అంటే ఒక నారి శక్తి, మమ్మల్ని అలానే పెంచారనీ వివేక కుమార్తె సునీత అన్నారు. తప్పు అంటే తప్పు అని చెప్పే మనస్తత్వం తమదని పేర్కొన్నారు. వివేకాను హత్య చేసి, మమ్మల్ని రోడ్డు పాలు చేశారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసనీ గుర్తు చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, షర్మిలను గెలిపించాలని కోరారు. షర్మిలను ఎంపీగా చూడాలని వివేకా కోరిక అని తెలిపారు. అందుకే ప్రజలు భారీ మెజారిటీ తో గెలిపించాలని సునీత తెలిపారు. బ్రహ్మంగారిమఠంలో జరిగిన షర్మిల ఎన్నికల ప్రచారానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసుడు సీఎం జగన్‌ కాదు: షర్మిల

వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్‌ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.