ETV Bharat / politics

ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు-వాలంటీర్లే కర్త,కర్మ,క్రియ గా వైసీపీ ప్రచారం

Volunteers Campaigning for YSRCP in Violation of Election Rules: ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినా వైసీపీ నేతలు లక్ష్యపెట్టడంలేదు. రాష్ట్రంలో వాలంటీర్ల సాయంతో ఓటర్లను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వ పథకాల సర్వే పేరిట వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు.

volunteers_campaign
volunteers_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 18, 2024, 8:36 PM IST

Volunteers Campaigning for YSRCP in Violation of Election Rules: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్లు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా వాలంటీర్లు ‌నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు (Volunteers Violating Election Rules). ప్రభుత్వ పథకాల సర్వే పేరిట వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. మరి కొన్ని చోట్ల పార్టీ జెండాలను బహిరంగంగా పట్టుకొని ప్రచారాలకు తిరుగుతున్నారు. ఈ ఎన్నికలలో జగన్​ను మళ్లీ సీఎం చెయ్యాలని వాలంటీర్లు హైకోర్టు ఆదేశాలను, ఎన్నికల నియమావళిని పక్కన పెట్టి వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇలా సర్వేల పేరుతో వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న వాలంటీర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి పనులు వాలంటీర్లకు వద్దు - కలెక్టర్లకు సీఎస్​ ఆదేశాలు

Anakapalli District: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్​ ఇటీవల అభ్యర్థులను ప్రకటించారు. దీనిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి కూడలిలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాలకు వార్డు వాలంటీర్లు పెద్ద ఎత్తున బాణాసంచా వెలిగించి సంబరాలను జరుపుకోవడం చర్చనీయాంశం. దీనిపై నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు గవిరెడ్డి రమణ ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్సీపీ ప్రచారకర్తలుగా వాలంటీర్లు- ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్

ఇదే నియోజకవర్గంలో గొలుగొండ మండలం పాతమల్లంపేటలో వైసీపీ ప్రభుత్వం చెప్పిన వివిధ సర్వేల పేరట ఇంటింటికి తిరిగి వివిధ సర్వేల ముసుగులో ఎన్నికల ప్రచారాన్ని (Volunteers campaigning for YCP) బాహాటంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్​ వచ్చినా వాలంటీర్లు ఓ పార్టీకి ప్రచారం చేయడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరించాల్సిన వీరు ఎన్నికల ప్రచారాన్ని ఎలాగా చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఓట్ల ఎర- విందు భోజనాలు, బహుమతుల పంపిణీ

YCP Leaders Giving Gifts to Volunteers: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు వాలంటీర్లను, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రొద్దుటూరులోని వాలంటీర్లకు సైతం వైసీపీ నాయకులు తాయిలాలు అందిస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్నందుకు వాలంటీర్లకు గోడ గడియారాలను వైసీపీ నాయకులు పంపిణీ చేస్తున్నారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, చిత్రాలు ముద్రించి గడియారాలు పంపిణీ చేయడం విమర్శలకు దారితీస్తోంది. వాలంటీర్లకు తాయిలాల పంపిణీ చేయడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.

Anantapur District: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ కండువాలు కప్పుకుని కరపత్రాలను పంచుతున్నారు. కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఓటర్లను మభ్యపెడుతున్న వైసీపీ నేతలు - ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వాలంటీర్ల ద్వారా ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.