ETV Bharat / politics

డ్రగ్స్​ కంటైనర్ మా పరిధిలోకి రాదు - మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ - VISAKHA CP ON DRUGS CASE - VISAKHA CP ON DRUGS CASE

Visakha Drugs Case : సీబీఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని, తమ కారణంగా సోదాలు ఆలస్యమయ్యాయనడం సరికాదని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. కంటైనర్‌లో డ్రగ్స్‌ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని, సీబీఐ కేవలం డాగ్‌ స్క్వాడ్‌ సహకారం కోరితే ఇచ్చామని వెల్లడించారు. కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్తూ కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని పేర్కొన్నారు. విశాఖలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ రవిశంకర్‌ చెప్పారు.

visakha_drugs_case
visakha_drugs_case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 1:19 PM IST

Updated : Mar 22, 2024, 4:00 PM IST

Visakha Drugs Case : సీబీఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని, తమ కారణంగా సోదాలు ఆలస్యమయ్యాయనడం సరికాదని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. కంటైనర్‌లో డ్రగ్స్‌ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని, సీబీఐ కేవలం డాగ్‌ స్క్వాడ్‌ సహకారం కోరితే ఇచ్చామని వెల్లడించారు. కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్తూ కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని పేర్కొన్నారు. విశాఖలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని సీపీ రవిశంకర్‌ చెప్పారు.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్​ తెరవకుండా యత్నించారా? - YCP LEADERS IN VIZAG DRUGS CASE

విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్​ ఉన్నట్లు అందిన సమాచారం కలకలం రేపింది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ చేరినట్లు ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన దిల్లీ సీబీఐ విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. కంటైనర్​లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈనెల 16న విశాఖ చేరుకున్న నౌక కంటైనర్​ దిగుమతి చేసిన తర్వాత తమిళనాడుకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

బ్రెజిల్ నుంచి SEKU4375380 నంబర్​ కంటైనర్​ను సీజ్ చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్​లో వెల్లడించింది. LAB 224348 ఓషన్ నెట్ వర్క్ ఎక్ప్రెస్ తో సీల్ చేసి ఉన్న కంటైనర్​లో భారీ ఎత్తున డ్రగ్స్ గుర్తించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వెయ్యి బ్యాగుల్లో డ్రై ఈస్ట్ ఇందులో ఉన్నట్టుగా కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారని తెలిపింది. అయితే, లాసన్స్ బే కాలనీలో ఉన్న సంధ్యా అక్వా ఎక్స్​పోర్ట్​ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల సమక్షంలోనే సీబీఐ, పోర్టు అధికారులు కంటైనర్​ను తెరిచి సోదాలు నిర్వహించి నమూనాలు సేకరించారు.

డ్రగ్స్​ కంటైనర్ మా పరిధిలోకి రాదు - మా వల్ల సోదాలు ఆలస్యం కాలేదు: విశాఖ సీపీ

విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసు - కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు - Visakhapatnam Drugs Container Case

25 బ్యాగుల్లో ఉన్న పసుపు రంగు పదార్థాన్ని NCB డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించగా అన్నింటిలోనూ కొకైన్, మెధాక్వలైన్ ఉన్నట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో నార్కొటిక్స్ నిపుణులు ప్రతి ఒక్క బ్యాగ్​లో A, B, E పరీక్షలు నిర్వహించగా A పరీక్షల్లో ఓపియం, మార్ఫిన్, కొకైన్, హీరాయిన్, అంఫీటెర్మైన్స్ మెసాక్ లైన్ ఉన్నట్టు తేలింది. B పరీక్షల్లో మారిజునా, హషిష్ ఆయిల్, C పరీక్షల్లో కొకైన్, మెుధాక్వైలైన్ ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 49 నమూనాలు పరిశీలించగా అందులో 27 A పాజిటివ్ వచ్చినట్లు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్​లో స్పష్టం చేశారు. మిగిలిన వాటిల్లో టెస్ట్ E పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. పరీక్షలు, ఫలితాల అనంతరం కంపెనీ ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది. కంపెనీ ప్రతినిధులు, సీబీఐ అధికారుల బృందం సమక్షంలో తిరిగి ఆ కంటైనర్​ను అధికారులు సీజ్ చేశారు.

రెండు రోజులుగా సీబీఐ తనిఖీల ప్రక్రియ కొనసాగింది. కంటైనర్ సీల్ తీసిన దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ రావడం మళ్లీ దానిని సీల్ చేయడం ఈ ప్రక్రియనంతా అధికారులు వీడియో తీశారు. కంటైనర్లను పోర్టు అధారిటీ ఆధీనంలో ఉంచిన సీబీఐ అధికారులు మరింత భద్రత కోసం సిబ్బందిని కూడా నియమించారు. ఎన్​డీపీఎస్​ చట్టం సెక్షన్ 29 రెడ్ విత్ 8,23, 38 ప్రకారం సంధ్య అక్వా ఎక్స్​పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సహా అనుమానితులైన గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐర్​లో పేర్కొంది.

విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ - Vizag CP Ravi Shankar

Last Updated : Mar 22, 2024, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.