Uttarakhand CM Election Campaign in Telangana : ప్రపంచం మొత్తం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని, మోదీ హయాంలో దేశం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ దామి అన్నారు. నిజామాబాద్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు హాజరయ్యారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో అర్వింద్ నామినేషన్‌కు హాజరైన అనంతరం, పాత కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
Lok Sabha Elections 2024 : ఈ సందర్భంగా దేశం మొత్తం అందరికీ ఒకటే నియమం ఉండాలని పుష్కర్‌సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం పేదలకు పథకాలు, నిధులు అందవని, ఓ వర్గానికి దోచిపెడతారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. హిందువుల సొత్తును ముస్లింలకు దోచిపెడతారని దుయ్యబట్టారు.
నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్- డిపాజిట్ చెల్లించిన పసుపు రైతులు
ధర్మపురి అర్వింద్‌కు ప్రజల ఆశీర్వాదం కావాలి. గత ఎన్నికల కంటే అధిక మెజారిటీతో అర్వింద్‌ను గెలిపించాలి. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లోనూ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. మూడోసారి మోదీ అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలబడాలి. మోదీ నేతృత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. - పుష్కర్‌సింగ్ ధామి, ఉత్తరాఖండ్ సీఎం
నేడు మరో సెట్ దాఖలు : అంతకుముందు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ నేడు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ దామీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, సూర్యనారాయణలు అర్వింద్ నామినేషన్లో పాల్గొన్నారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగిన ఉత్తరాఖండ్ సీఎం, నేరుగా కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో అర్వింద్ నామినేషన్లో పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది - తెలంగాణలోనూ వార్ వన్ సైడే : ధర్మపురి అర్వింద్
సిద్దిపేటలో అమిత్ షా : నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియడంతో పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు బీజేపీ అభ్యర్థుల నేతల నామినేషన్లలో పాల్గొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీని మరోసారి ప్రధానిని చేయాలని, రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం : అమిత్‌షా