TDP Ra Kadali Ra Programme in Jeedi Nellore: వైఎస్సార్ హయాంలో జరిగిన అవినీతి బయటపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 42 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేలినట్లు ఆయన ప్రకటించారు. చనిపోయిన ఆ తండ్రిపైనే కేసు పెట్టాలన్న ఘనుడు జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరులో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో పాల్గొన్నారు.
దాదాపు 7నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఈ సభకు అభిమానులు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమిళనాడు నుంచి 50 కోట్ల రూపాయలు తరలిస్తుంటే దోపిడీ జరిగిందని, వాస్తవాలు బయటకు వస్తాయని దోపిడీ ఘటనను నిర్వీర్యం చేశారని టీడీపీ అధినేత ఆరోపించారు. కుటుంబకలహాలతో జగన్ కుటుంబం రోడ్డెక్కే స్థితికి వచ్చారని, ఆస్తుల పంపకం సరిగా జరగలేదని సొంత సోదరే తిరగబడిందన్నారు. అంత:పుర రహస్యాలు వారే చెబుతున్నారని, కుటుంబ గొడవలను రాష్ట్ర వ్యవహారంగా మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. వారి బాబాయ్‌ను వారే చంపుకొని తనపై అపవాదు మోపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అపవాదులు మోపి నిరూపణలో విఫలమయ్యారని అన్నారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు
ఓటును రిమోట్ కంట్రోల్ ద్వారా తొలగించాలని యత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ కార్యాలయంలో దస్త్రాలను ఐప్యాక్ మాయం చేసిందని అన్నారు. తిరుపతికి చెందిన అన్ని దస్త్రాలను ఆ సంస్థ మాయం చేసిందన్నారు. దస్త్రాల చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించే వరకు వదిలిపెట్టేది లేదని వెల్లడించారు. స్మగ్లర్లకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామేనని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజల నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్‌తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు
మద్యపాన నిషేధం అమలు చేయకపోతే ముఖ్యమంత్రి జగన్ ఓటు అడగబోనన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మద్యంపై 25 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చారని వివరించారు. రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. మద్యం, ఇసుక విధానం పెద్ద కుంభకోణమని అన్నారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఇసుక, మద్యం, గనులు, గ్రానైట్ అన్నీ దోచేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గుత్తేదారులు, స్మగ్లర్లంతా వైఎస్సార్సీపీ నేతలేనని విమర్శించారు. పోలీసు వ్యవస్థను సైతం నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో కోతలు లేని విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ బ్రాండ్ పేరుతో నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు మాత్రం ధనదాహం తీరలేదని అన్నారు. మద్యం ధరలు పెరగకుండా నాణ్యమైన మద్యం అందిస్తామని చంద్రబాబు వివరించారు.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం - అభ్యర్థిని నిలిపే అంశంపై సందర్భానుసారం నిర్ణయం
దేశంలో 24 శాతం నిరుద్యోగంతో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని భరోసానిచ్చారు. రాజకీయ కక్షలతో కంపెనీలను తరిమేయడం బాధాకరమని, వైఎస్సార్సీపీ వేధింపులతో గల్లా జయదేవ్ రాజకీయాలు వదులుకున్నారని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే రాజకీయాలు వదులుకుంటున్నట్లు చెప్పారని అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.
రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకు?: చంద్రబాబు
పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది తన జీవిత ఆశయమని చంద్రబాబు అన్నారు. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది తన సంకల్పమని, తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని, రాతియుగం వైపు వెళ్లకుండా స్వర్ణయుగం వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఓడిపోతామని తెలిసి జగన్ మానసిక ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయని, ఉపాధి లేక వలస వెళ్లే దుస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ కావాలని పిలుపునిచ్చారు.
వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, ప్రజలకు సేవ చేయాలని సూచించారు. వాలంటీర్లు వైఎస్సార్సీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. జగన్‌ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని జగన్ చెబుతూ, వాలంటీర్లలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారని చంద్రబాబు పేర్కోన్నారు.
'రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలుకుదాం - మహాత్మాగాంధీకి అదే అసలైన నివాళి'