TDP Leaders Fire on YS Jagan Comments: బాధిత కుటుంబాన్ని పరామర్శించే పేరిట జగన్ శవరాజకీయాలు చేశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని జగన్ తెలుగుదేశానికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. పరామర్శకు వెళ్లి రాష్ట్రపతి పాలన కోరడం, గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రషీద్, జిలానీల మధ్య ఉన్న గొడవలపై అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వద్ద జరిగిన పంచాయతీలో పరిష్కారం కాకపోవడంతోనే హత్య జరిగిందని పల్లా అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలోనే ముస్లిం సోదరులపై ఎక్కువగా హత్యలు జరిగాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ఎప్పుడూ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందని పల్లా తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి ఆయన ఉనికిని కాపాడుకోవడానికే శవరాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
హత్యా రాజకీయాలకు పేటెంట్ వైఎస్సార్సీపీదే: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పార్టీలకు ఆపాదించటం సిగ్గుచేటని నరసరావుపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. శవాల పునాదులపై ఏర్పడిందే వైఎస్సార్సీపీ అని, దానికి అనుగుణంగానే వినుకొండ ఘటనను పులిమి శవ రాజకీయాలకు తెరలేపారని శ్రీధర్ ఆక్షేపించారు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పునాదులు, బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు శాంతి భద్రతల గురించి లేఖ రాసే అర్హత జగన్‌కు ఉందా అని శ్రీధర్ నిలదీశారు. నిజంగా రాష్ట్ర ప్రజలపై అంత మమకారం ఉన్నట్లయితే గత ఐదేళ్లలో మీ కార్యకర్తలు చేసిన హత్యాకాండలపై విచారణ జరిపించాలని ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. తోట చంద్రయ్య ఉదాంతం, డాక్టర్ సుధాకర్ హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ విధానంపై ప్రధానికి లేఖ రాసి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
జగన్ బెంగళూరు ప్యాలస్‌లో 40 రోజులు డ్రామాలు ఆడారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు జగన్ తెరలేపారని ఆయన మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడిని రాజకీయ రంగు పులిమి విద్వేషాలతో రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ దారుణ హత్యకు కారణాలు ఏంటి? - వెలుగులోకి విస్తుపోయే విషయాలు - Reasons for Vinukonda Murder