ETV Bharat / politics

జగన్​కి ఒటమి భయం పట్టుకుంది - అందుకే దేవుడిపై భారం: టీడీపీ నేతలు

TDP Leaders Comments on CM Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ మోసాలకు అంతులేకుండా పోయిందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పాదయాత్ర సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన జగన్ రెడ్డిని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని మండిపడ్డారు.

tdp_leaders_on_jagan
tdp_leaders_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 4:15 PM IST

TDP Leaders Comments on CM Jagan: అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 500 రోజులుగా అధర్మంపై పోరాడుతున్న రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మనోభావాల్ని దెబ్బతీసేలా జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రైతుల గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేయని అరాచకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పోరాటంలో మరణించిన రైతులకు నివాళులు అర్పించారు. అమరావతి రైతుల ఆశయం త్వరలోనే నెరవేరబోతుందని వెల్లడించారు. జగన్ రెడ్డిని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు.

అవమానాలు, అనిశ్చితికి తెర - ఎంపీ లావు రాజీనామాకు కారణమదే!

Former Minister Dadi Veerabhadra Rao: ప్రజల భూములు దోచుకోవడానికే ఈ తుగ్లక్ చట్టాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ప్రజల రెవెన్యూ రికార్డులు మొత్తం వైసీపీ నేతలకు అప్పగించేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పెట్టారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగా అధికారం ఇస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖకు అధికారాలు అప్పగిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఏ విధంగా ఉంటుందని నిలదీశారు. న్యాయస్థానాల్లో పరిష్కరించాల్సిన వివాదాలను రెవెన్యూశాఖ పరిష్కరించేలా ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని మండిపడ్డారు. ప్రజల ఆస్తులపై, సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు వేయడం పిచ్చికి పరాకాష్ట కాదా అని దుయ్యబట్టారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో జగన్ సంతకానికే రక్షణ లేదని విమర్శించారు. ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 27/2023ను, జీవో నెం.572ను రద్దు చేసే వరకు పోరాడతామని దాడి వీరభద్రరావు తెలిపారు.

గంటా రాజీనామా విషయంలో మూడేళ్లు గాడిదలు కాశారా? - స్పీకర్, సీఎం జగన్​పై బుచ్చయ్య చౌదరి ఆగ్రహం

Former Minister Nettem Raghuram: జగన్ రెడ్డి ఇచ్చేది ఆసరా కాదు మహిళలకు టోకరా అని మాజీ మంత్రి నెట్టెం రఘురాం విమర్శించారు. సీఎం జగన్ మహిళా ద్రోహిగా మిగిలి పోతాడన్నారు. కోటి 14 లక్షల డ్వాక్రా సంఘాలు ఉంటే 79 లక్షల మందికి ఆసరా ఇస్తామని చెప్పి సకాలంలో రుణాలు చెల్లించిన 75 శాతం డ్వాక్రా సంఘాల సభ్యులకు టోకరా వేశాడని మండిపడ్డారు. మహిళలు పొదుపు చేసుకున్న 2,118 కోట్ల రూపాయల అభయ హస్తం నిధులు ఇతర అవసరాలకు వాడుకున్న ముఖ్యమంత్రి మహిళలను ఉద్దరిస్తాడా అని ప్రశ్నించారు. జగన్​ను నమ్మి ఓటు వేస్తే మహిళలకు టోకరా పెట్టాడని ఎద్దేవా చేసారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు, చెత్త పన్నులు పెంచటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదంతా జగన్నాటకం తప్ప మరోటి ఉందా అని నెట్టెం ఎద్దేవా చేశారు.

జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు: టీడీపీ

Former Chairman of Legislative Council MA Sharif: జగన్​కి ఒటమి భయం పట్టుకుంది, ఇక దేవుడి మీద భారం వేశారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన ఒక్కచాన్స్ అయిపోయిందన్న ఆయన రాబోయేది తెలుగుదేశం - జనసేన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమాజంలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. షర్మిల విమర్శలకు సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్​ని జగన్ హైజాక్ చేశారని అన్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ కావటం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని ఎంఏ షరీఫ్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.