TDP Leaders Allegations on YCP Govt Irregularities: ఐఎంజీపై సజ్జల, ఇతర వైసీపీ నాయకులు చేస్తున్న అర్థరహిత ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) విమర్శించారు. 2006లోనే రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలవాయి గోవర్థన్ రెడ్డి ఐఎంజీ భారత భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం క్రీడల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఐఎంజీకి చేసిన భూ కేటాయింపులు పూర్తి పారదర్శకమని ఏసీబీ కోర్టు, హైకోర్టు రెండూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. ఎప్పటికైనా భారతదేశంలో ఒలంపిక్స్ గేమ్స్ జరగాలన్నది చంద్రబాబు విజన్ అని దానికి తగ్గట్టు ఆనాటి హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి క్రీడా సదుపాయాలతో సిద్ధంగా ఉండాలన్నది ఆయన లక్ష్యమని వివరించారు.
జగన్ హామీలన్నీ శుద్ధ అబద్ధం- తీవ్రంగా నష్టపోయిన ఉద్యాన రైతాంగం
Former Minister Alapati Rajendra Prasad: జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసే ముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో తెలపాలని సవాల్ విసిరారు. 17 శాతం కన్నా ఎక్కువ హామీలు అమలు చేసివుంటే మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో నిరూపించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగం నడ్డివిరిచిందని మండిపడ్డారు.
కార్పొరేషన్లను, మద్యాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పెందుకు చేశారని ప్రశ్నించారు. ఏ వర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలన్నారు. సామాజిక న్యాయం చేసి ఉంటే సుధాకర్, చంద్రయ్యలు చనిపోయి వుండేవారే కాదని ఆక్షేపించారు. ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయకపోగా సారా కొట్ల వద్ద ఉపాధ్యాయుల్ని కాపలా ఉంచారని విమర్శించారు. జగన్‌కు విశ్వసనీయత లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయని దుయ్యబట్టారు.
అనిల్‌కు మాటలు ఎక్కువ, మ్యాటర్ తక్కువ - విజయసాయిరెడ్డి ఓడిపోవడం ఖాయం: కోటంరెడ్డి
TDP leader Dhulipalla Narendra: ఛార్జీలు తగ్గిస్తామంటూ గద్దెనెక్కిన జగన్ బాదుడే బాదుడు అంటూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలోనే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వైసీపీ నేతలకు ఓటు హక్కు ఉందా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై మోపుతున్న ఈ అధిక పన్నుల భారాలు తగ్గాలంటే రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజల పక్షాన ఉండే తెలుగుదేశం- జనసేన పార్టీలను రానున్న ఎన్నికలలో ఆశీర్వదించి, సహకారం అందించాలని కోరారు.
తల్లిలాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల