TDP Leaders Allegations on CM Jagan: బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు హైదరాబాద్ పాట పాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆరోపించారు. విశాఖలో జగన్ రెడ్డి 40 వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నాడని అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అన్నాడని మండిపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. గతంలో అమరావతిలో 30 వేల ఎకరాలున్నాయని ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని అన్నారు కానీ ఇప్పుడు కొత్త నాటకం మొదలెట్టారని విమర్శించారు. జగన్ అమరావతిని పూర్తి చేస్తానంటూ ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాక నాశనం చేశాడని మండిపడ్డారు.
నీ రాక - మాకో శాపం స్వామీ! 'ఆడుదాం ఆంధ్రా' ముగింపుతో జనం ఉక్కిరిబిక్కిరి
కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశాడని మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడని విమర్శించారు. జగన్ మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నాడని ఇప్పుడు హైదరాబాద్ పేరుతో నాలుగో ముక్క తెరపైకి తీసుకొచ్చాడని విమర్శించారు. బినామీ ఆస్తుల కోసం ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని అచ్చెన్న దుయ్యబట్టారు. జగన్ రెడ్డి అరాచకాలు తెలియాలంటే రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్ధమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత అధికారంలోకి వస్తామని అమరావతిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతాని, రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కరవుతో పెరిగిన వలసలు - విద్యార్థుల జీవితాలు అతలాకుతలం
Dhulipalla Narendra on CM Jagan: సజ్జలకు దొంగ ఓట్ల పేటెంట్ ఇచ్చినట్లు, వైవీ సుబ్బారెడ్డికి రాజధానిని ముక్కలు చేసే పేటెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించాడని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు. ఓడిపోతున్నామని తెలిసే మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాగం వైసీపీ అందుకుందని మండిపడ్డారు. దోచుకున్నది దాచుకోవటానికి, ఆస్తులు కాపాడుకోవటానికే పక్క రాష్ట్రంలో రాజధాని అంటున్నారని ఆరోపించారు. రాజధానిని మూడు ముక్కలు చేసింది కాక ఇప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని అనటం ఓటమి భయమేనని విమర్శించారు. రెండు నియోజకవర్గాల్లో ఓటు దరఖాస్తు చేసి సజ్జల కుటుంబం చట్టరీత్యా నేరానికి పాల్పడిందని ధ్వజమెత్తారు.
హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ - పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన వాయిదా
సెక్షన్ 30 ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన సజ్జల కుటుంబంపై, పొన్నూరు, మంగళగిరి ఈఆర్వోల మీద ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ సమావేశాల్లో ఇవ్వాల్సిన ఓటు దరఖాస్తుల జాబితా అధికారులు సక్రమంగా ఇవ్వకుండా వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దొంగ ఓట్ల అక్రమాల్లో కథ, స్క్రీన్ ప్లే అంతా సజ్జలేనని దుయ్యబట్టారు. ఉద్దేశపూర్వకంగానే తాను తప్పు చేసినట్లు సజ్జల తన ప్రకటన ద్వారా బహిరంగంగా ఒప్పుకున్నారన్నారు. పొన్నూరులో ఓటు దరఖాస్తు చేసుకున్న 15 రోజులకు మంగళగిరిలో మళ్లీ దరఖాస్తు చేయటం దొంగతనం కాక మరేంటని నిలదీశారు.