Chandrababu fire on officers : ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఒక వ్యక్తి, పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలన్న చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలాడొద్దు అని హితవు పలికారు. పింఛన్ తీసుకోవడంలో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. పింఛన్ కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ హత్యల కింద కేసు నమోదు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పింఛన్ వ్యవహారంపై తాము గవర్నర్ వద్దకు వెళ్లే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పించారు, ఇవాళేమో బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నారు, బ్యాంకుల్లో నగదు జమ చేస్తే తీవ్రమైన ఎండ వేడిమిలో పింఛన్ కోసం ఎలా వెళ్తారు ? అని ప్రశ్నించారు. అవసరానికి డబ్బులు రాకుండా చేస్తున్నారని, మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా? అని అధికారులని నిలదీశారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ సిబ్బందితో పంచాలని, అంతే తప్ప కుంటి సాకులతో వృద్ధులను ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు.
మా పాలన స్వర్ణయుగం- వైసీపీ పాలన రాతియుగం: చంద్రబాబు - Chandrababu Fire on CM Jagan
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని చంద్రబాబు అన్నారు. బ్యాంకు ఖాతాల్లో పింఛన్ల నగదు జమచేస్తామంటున్న అధికారులే పింఛన్దారుల బ్యాంకు ఖాతాల వివరాలు లేవని గతంలో చెప్పారని గుర్తుచేశారు. గత నెలలో లేని వివరాలు ఇప్పుడెలా వచ్చాయి అని ప్రశ్నించారు. దాదాపు 65 లక్షల మంది పింఛన్‌దారులు ఉన్నారని, 48 లక్షల మందికి ఖాతాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్న అధికారులు ఆధార్ లింక్ ఉన్న లబ్ధిదారులకు బ్యాంకుల్లో వేస్తామనడం తగదన్నారు.
కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటివద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేసినా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పడం కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నమే అని ఆరోపించారు. సిబ్బంది ఉన్నా ఇంటింటికీ వెళ్లి పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఒక్కో వ్యక్తి 45 మందికి పింఛన్లు ఇస్తే సరిపోతుందని, ఎన్నికల అధికారులు చెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు.
మద్యపానం నిషేధం చేయని నువ్వు ఏ మొఖంతో ఓట్లు అడుగుతావు జగన్: చంద్రబాబు - Chandrababu on Jagan