TDP Janasena BJP Praja Galam Public Meeting: హెలికాప్టర్లో బొప్పూడి ప్రజాగళం వేదికవద్దకు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాగబాబు చేరుకున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేరుకున్నారు. సభావేదిక వద్దకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేరుకున్నారు. అదే విధంగా మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్ రెడ్డి సైతం విచ్చేశారు.
రాష్ట్రం నలుమూలల నుంచి బొప్పూడి ప్రజాగళం సభకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కార్యకర్తలు, ప్రజలు చేరుకుంటున్నారు. సభకు వచ్చే ప్రజలకు మార్గమధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు నిర్వాహకులు కల్పించారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వేల సంఖ్యలో వాహనాలు ప్రజాగళం సభకు వస్తున్నారు. ఆర్టీసి పూర్తి స్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు.
చరిత్రలో నిలిచేలా ప్రజాగళం సభ - పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి రానున్న ముగ్గురు అగ్రనేతలు
పదేళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే వేదికపైకి రానున్నారు. బొప్పూడి ప్రజాగళం సభకు చరిత్రలో నిలచిపోతుందంటున్నారు. సభావేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కేరింతలు ఉత్సాహంతో కార్యకర్తలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. మోదీకి బీజేపీ, టీడీపీ, జనసేన ప్రతినిధులు స్వాగతం పలికారు. అదే విధంగా పల్నాడు హెలీప్యాడ్ వద్ద ప్రధానికి 8 మంది నేతలు స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పూడి సభాప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మోదీకి చంద్రబాబు, పవన్, ముఖ్య నేతలు స్వాగతం పలకారు. 6 గంటల 10 నిమిషాలకి బొప్పూడి నుంచి తిరిగి గన్నవరం చేరుకుని, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో మోదీ దిల్లీకి చేరనున్నారు.
బొప్పూడిలో కూటమి ‘ప్రజాగళం’ - భద్రత కట్టుదిట్టం
గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయం: పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించారు. ప్రజాగళం సభ ప్రధాన స్టేజ్ మీదకు 14 మంది టీడీపీ నేతలు వెళ్లనున్నారు. వీరిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల, అయ్యన్న, అశోక్, కళా వెంకట్రావు, షరీఫ్, రామానాయుడు, తంగిరాల సౌమ్య, ఆనంద్‌బాబు, అనగాని, ప్రత్తిపాటి, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
ప్రజాగళం సభ ప్రధాన స్టేజ్ మీదకు 9 మంది జనసేన నేతలు రానుండగా, వారిలో పవన్, మనోహర్, నాగబాబు, శివశంకర్, కొణతాల, వెంకటేశ్వరరావు, బొమ్మిడి నాయకర్, దుర్గేష్, లోకం మాధవి ఉన్నారు. అదే విధంగా పురందేశ్వరి, కిరణ్‌కుమార్‌రెడ్డి, సి.ఎం.రమేష్, టీజీ వెంకటేష్, సుధాకర్‌బాబు, జీవీఎల్ మొత్తం ఆరుగురు నేతలు బీజేపీ నుంచి స్టేజ్‌పైన ఉంటారు.