TDP Chief Chandrababu on MP Candidates Finalization: తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపట్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది.
ముస్లింలకు మేలు చేసేది టీడీపీనే - వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి: చంద్రబాబు
ఎన్డీఏ(NDA)కు లోక్సభలో 400కు పైగా స్థానాలు, ఆంధ్రప్రదేశ్ 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కోడ్ అమల్లోకి వచ్చినా మారని అధికారుల తీరు- చంద్రబాబు ఇంటివద్ద బెంచీలు ధ్వంసం
"ఎన్డీయేకు 400, ఏపీకి 160కి పైగా అసెంబ్లీ స్థానాల నినాదం ప్రతిధ్వనిస్తోంది. నవశకం ఆవిర్భావానికి ఇది సంకేతం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత
తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా కింది విధంగా ఉండే అవకాశం:
- శ్రీకాకుళం- కే. రామ్మోహన్ నాయుడు
- విశాఖ- ఎం.భరత్
- అమలాపురం- గంటి హరీష్
- విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)
- గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
- నరసరావుపేట- లావు శ్రీకృష్ణదేవరాయులు
- ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి/ రాఘవరెడ్డి
- నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాద్
- అనంతపురం- బీ.కే.పార్థసారధి
- నంద్యాల- బైరెడ్డి శబరి
అధికారుల కళ్లకు గంతలు- వైసీపీ వ్యూహంతో ఓటర్లకు ఊహించని తాయిలాలు