ETV Bharat / politics

ఉద్యోగులెవరూ జగన్​కు ఓటు వేయలేదు- నేడు పాసుపుస్తకాల నకళ్ళు దహనానికి చంద్రబాబు పిలుపు - cbn on Postal Ballot Voting - CBN ON POSTAL BALLOT VOTING

Chandrababu Naidu on Postal Ballot Voting: రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ అవినీతి, అరాచకాలకు ముగింపు పలికేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఒక్క ఉద్యోగి కూడా జగన్‌కు ఓటు వేయలేదన్నారు. జగన్‌ ఒక విధ్వంసకారి అన్న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క మంచిపని కూడా చేయలేదని మండిపడ్డారు.

Chandrababu Naidu on Postal Ballot Voting
Chandrababu Naidu on Postal Ballot Voting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 7:18 AM IST

Chandrababu Naidu on Postal Ballot Voting : రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మే 13న జరిగే పోలింగ్‌ ప్రజల కోసం, రాష్ట్రం భవిష్యత్తు కోసమని చంద్రబాబు అన్నారు. అందుకే ఎన్నడూ లేనంత విధంగా ఉద్యోగులు బ్యాలెట్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వాళ్లు డబ్బులిచ్చినా ఉద్యోగులు తీసుకోలేదని, ఒక్క ఉద్యోగి కూడా సైకో జగన్​కు ఓటు వేయలేదని, టీడీపీకు ఓటేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, కూటమి ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించిన ఆయన మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో సగం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు.

పాసుపుస్తకాల కాపీలు దహనం : జగన్ లాంటి అరాచకవాదిని ఇంటికి పంపించకుంటే ప్రజల ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాల కాపీలు దహనానికి పిలుపునిచ్చారు. నేడు సాయంత్రం 4గం.కు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన భూములు, తాతలు సంపాదించిన పొలాల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ బొమ్మలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రాజముద్ర వేసి పాసు పుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Chandrababu Today Schedule : రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 ఎన్నికక ప్రచారం ముగుస్తోంది. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. పలమనేరులో మార్చి 27న 'ప్రజాగళం' పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించారు. నేడు చివరి రోజు కావడంతో నంద్యాల, చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.

పోలింగ్‌ రోజున మీరు వేసే ఓటుకు తాడేపల్లి ప్యాలెస్‌ బద్ధలుకావాలి: చంద్రబాబు - Chandrababu Allegations on Jagan

Chandrababu Allegations on Jagan at Prajagalam Meeting in Eluru: పోలింగ్‌ రోజున వేసే ఓటుకు తాడేపల్లి ప్యాలెస్‌ బద్ధలుకావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మీ భూమిపై జగన్‌ పెత్తనమేంటని చంద్రబాబు నిలదీశారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. జగన్‌ అహంకారి, సైకో, విధ్వంసకారుడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారని మండిపడ్డారు. మీ భూమి పత్రంపై సైకో జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం లోపభూయిష్టంగా ఉందని చంద్రబాబు అన్నారు. సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.

ఫ్యానుకు ఉరేయాలి - వైఎస్సార్సీపీని తరిమేయాలి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

పోలీసులకు రద్దయిన అలవెన్సులన్నీ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతే కాకుండా హోంగార్డుల జీతాలు రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉందని చంద్రబాబు అన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని సూచించారు. సమాజ హితం కోసం ప్రజల భవిష్యత్తు కోసం పవన్‌ కల్యాణ్‌ ముందుకొచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరు సైకో జగన్​ను సాగనంపడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్​పై ఎక్స్​లో లోకేశ్​ పోస్టు - వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ - CBN Responded Titling Act in X

'ఉద్యోగులెవరూ సైకో జగన్​కు ఓటు వేయలేదు' - సాయంత్రం పాసుపుస్తకాల కాపీలు దహనం చేయాలని చంద్రబాబు పిలుపు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.