ETV Bharat / politics

గోదావరి జిల్లాల్లో ఆయన ఓ అరాచక 'గ్రంథం'! - YCP leader irregularities - YCP LEADER IRREGULARITIES

YCP leader irregularities in AP: ఆయన ప్రజాప్రతినిధైనా, రౌడీ రారాజు! ఆ అరాచకాలు చెప్పాలంటే ఒక గ్రంథం అవుతుంది. పచ్చని గోదారి సీమలో రౌడీ రాజ్యం సృష్టించారు. అమాయకుల్ని జైల్లో వేయించడం, సత్ప్రవర్తన పేరుతో రౌడీషీటర్లని విడిచిపెట్టేలా చేయడం ఆయన స్టైల్‌! ప్రత్యర్థి పార్టీ వాళ్లు కనిపిస్తే, గుండెల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నట్టు ఫీలైపోతారు. జగనన్న కాలనీలూ, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో భూమాయ చేసి కోట్లు వెనకేసుకుంటున్న నేత అక్రమాలపై ప్రత్యేక కథనం.

YCP leader irregularities in AP
YCP leader irregularities in AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 11:08 AM IST

YCP leader irregularities in AP: ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లోని ప్రాంతం అది, ఆ ఊళ్లో పుట్టడమే ఓ వరం అనుకుంటారు స్థానికులు! అలాంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా, ఆయన్ని ఎన్నుకోవడమే వారికి శాపమైంది. సామాన్యుడికి ఏ హక్కులూ స్వతంత్రంగా పొందలేని ప్రాంతంగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎవరి పైనైనా ఫిర్యాదు చేసినా, కేసు నమోదు కాదు. ఆయన ఫోన్‌ చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలో? వద్దో పోలీసులకు ఓ స్పష్టత వస్తుంది. ఆయనకు కోపం వస్తే ఎదుటి పార్టీనాయకురాలికి 70 ఏళ్లు దాటి ఉన్నా గుంపులోకి వచ్చి రాళ్లు వేశారంటూ ఫిర్యాదు అందుతుంది. ఎఫ్ఐఆర్​లో పేరూ నమోదవుతుంది. ఆయనకు నచ్చితేనే ఆ ఊళ్లో ఇల్లు కట్టుకోగలం. నచ్చకపోతే అధికారులు ఇంటి నిర్మాణానికి ఏదో ఒక అడ్డు చెబుతూనే ఉంటారు.

2019 ఎన్నికల సమయంలో ఆ పట్టణంలోనే పక్క నియోజకవర్గానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఒక స్వీటు దుకాణం యజమాని ఇల్లు కట్టుకునేందుకు పునాదులకు గుంతలు తవ్వారు. ఇంతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మనం ప్రస్తావిస్తున్న నాయకుడు ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ స్వీటు దుకాణం యజమానిది ప్రత్యర్థి పార్టీ కావడంతో, ఇల్లు కట్టుకోనివ్వనంటూ అడ్డుప‌డ్డారు. అనుమతులు ఇవ్వకుండా చేశారు. ఎవరైనా ఏదైనా పని ఉండి ఆ ప్రజాప్రతినిధిని కలిస్తే, భుజం మీద చనువుగా చెయ్యేసి నవ్వుతూ మాట్లాడతారు. కానీ, ‘ఏంటోనోయ్‌ నాకు గాజు గ్లాసులు గుచ్చుకుంటున్నాయి’అని వెటకారమాడతారు. అంటే- ఆయన అంతకుముందు ఎన్నికల్లో జనసేనకు పని చేశాడని అర్థమన్నమాట. అందువల్లే పని జరగదని పరోక్షంగా హెచ్చరిస్తారు.

ఆ ప్రజాప్రతినిధి చుట్టూ ఒక ప్రత్యేక బ్యాచ్‌ ఉంటుంది. అందులో రౌడీషీటర్లూ ఉంటారు. హత్య కేసుల్లో పాత్ర ఉన్న వారి కుటుంబాలవారూ ఉంటారు. సెటిల్‌మెంట్‌ వ్యవహారం కనీసం అరకోటి మించుతుందంటే చాలు ఆ బ్యాచ్‌ రంగంలోకి దిగిపోతుంది. ఈ ప్రజాప్రతినిధి అండతో అందులో కొందరిపై ఉన్న రౌడీషీట్లు మాయమైపోయాయి. ఆ బ్యాచ్‌ భయపెట్టి, బెదిరించి ఎన్ని సెటిల్‌మెంట్లు చేసినా పోలీసులకు ఏం కనిపించదు వినిపించదు.! దాంతో వారికి సత్ప్రవర్తన సర్టిఫికెట్లు జారీ చేసి మంచివారిగా ముద్ర వేయించేసుకున్నారు.

జగనన్న కాలనీల లేఅవుట్ల కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తుందని ముందే ఆ ప్రజాప్రతినిధికి తెలుసు. కొందరు రైతులను భయపెట్టి దాదాపు 70 ఎకరాల భూముల్ని అనుచరులూ, బినామీలతో కొనిపించేశారు. ఎకరం 35 నుంచి 60 లక్షలకు కొనిపించి ఆనక అదే భూమిని ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చాలా చోట్ల ఊరు శివార్లలో నివాస యోగ్యం కాని భూములను ఇందుకు ఎంపిక చేసి ఆ భూ యజమానులకూ లబ్ధి కలిగించి వారి నుంచి ప్రయోజనం పొందారు. జగనన్న కాలనీల్లో మట్టి పూడిక పనుల్లో కోట్లలో అవినీతి చేశారు.

ఆ పట్టణం జిల్లా కేంద్రంగా మారాక అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు గిరాకీ మరింత పెరిగింది. ఈ ప్రజాప్రతినిధికి ఇదే ప్రధాన వనరుగా మారింది. ఈ ప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లిస్తే అనుమతులు లేకున్నా లేఅవుట్‌ వేసుకోవచ్చు, ప్లాట్లు అమ్ముకోవచ్చు. అనుమతులు లేని లేఅవుట్‌లో ఎకరానికి 5సెంట్ల స్థలం వాటాగా తీసుకుంటారు. పట్టణంలో కొంత కాలం కిందట ఓ భారీ అనధికారిక లేఅవుట్‌ వేశారు. ఆ లేఅవుట్‌కు వెళ్లేందుకు బృహత్‌ ప్రణాళికలో ఉన్న రహదారిని అడ్డగోలుగా ఆక్రమించి, పంట కాలువపై అనధికారిక వంతెన కూడా నిర్మించారు. ఈ మొత్తం వ్యవహారానికి కొమ్ముకాసినందుకు లేఅవుట్లో రెండకరాల స్థలం ముట్టజెప్పారని సమాచారం.

BAD ROADS: ఈ రోడ్లపై ఆయన బాగానే తిరుగుతున్నారు..ఇంకా వైకాపా ఎమ్మెల్యే ఏమన్నారంటే..!

భవనాలకు ప్లాన్‌ ఇవ్వాలన్నా ఈ ప్రజాప్రతినిధి అనుమతి తీసుకోవాల్సిదే. కప్పం కట్టని నిర్మాణాలపై ఆయన వర్గం నిరంతరం రెక్కీ నిర్వహిస్తుంటుంది. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నా సెట్‌బ్యాక్స్, పార్కింగ్‌ వంటి చిన్న చిన్న లోపాలను బూచిగా చూపిస్తారు. సంబంధిత అధికారులతో భవనాలు కూల్చేస్తామంటూ నిర్మాణదారులను బెదిరింపజేస్తారు. పట్టణానికి అనుకుని ఉన్న గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్‌ భూములను ఆక్రమించి బినామీ పేర్లతో అడ్డుగోలుగా ఆక్వా చెరువులు తవ్వారు. ఆక్వా జోన్‌ కాకున్నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూముల్లో చెరువులు తవ్వుకుని యథేచ్ఛగా ఆక్వా సాగు చేస్తున్నారు. పచ్చని పంట పొలాలు పాడైపోతున్నాయని అక్కడి రైతులు ఆక్రోశిస్తున్నా పట్టించుకోవడం లేదు.

Jsp vs YSRCP: వైసీపీ ఎమ్మెల్యేపై.. జనసేన కార్యకర్త పోస్ట్! తీసేయాలన్న పోలీసులు.. ససేమిరా అన్న జనసైనికులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.