Raghunandan Rao Comments Congress and BRS : కేఆర్ఎంబీ (KRMB), మేడిగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాలయాపన చేస్తుందో తమకు అర్ధం కావడంలేదన్నారు. వెంటనే దీనిపై సీబీఐ (CBI) విచారణకు అనుమతిస్తే దొంగలెవరో, దొరలెవరో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ హోదాలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోసం లేఖ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
'నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్లు చేయి' అనే ధోరణిలో రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని రఘునందన్ రావు మండిపడ్డారు. ఒకరిని ఒకరు కాపాడుకునేలా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. 2015లో కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్లి 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టింది కేసీఆరేనని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ అప్పజెప్పిందని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు తన్నుకుంటే తాము పెద్దన్న పాత్ర పోషించి రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తామని అన్నారు.
Raghunandan Rao about Metro Rail from Miyapur to Sangareddy : మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు మార్గం విస్తరించే వరకు తమ పోరాటం ఆగదని బీజేపీ సీనియర్ నాయకులు, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సెషన్‌లో సంగారెడ్డికి మెట్రో మార్గం గురించి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని రఘునందన్ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత శాసన సభ సమావేశాల్లో రైలు మార్గం గురించి సభలో విపరీతంగా మాట్లాడి, ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని రఘునందన్ అన్నారు. సంగారెడ్డికి మెట్రో రైలు మార్గం వచ్చే వరకు వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు చేస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి శాసన సభలో ఆడుతున్న నాటకమే కేఆర్ఎంబీ తప్ప ఇంకొకటి కాదు. కేఆర్ఎంబీ అయినా, కాళేశ్వరం గురించి అయినా ఇద్దరు ఒకరి ఒకరు కాపాడుకునే చేసిన ప్రయత్నంగా భారతీయ జనతా పార్టీ దీన్ని భావిస్తోంది' - రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే
రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ జలాలు తీసుకెళ్దామనుకున్న స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక : కేసీఆర్