ETV Bharat / politics

అద్దె భవనాల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు - కొత్త జిల్లాల్లో అధికారుల పాట్లు

Problems in Andhra Pradesh New Districts: పాడేరు జిల్లా ఎస్పీని కలవాలా? అయితే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లండి! పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలా? అయితే పౌష్టికాహార కేంద్రానికి వెళ్లండి! తిరుపతి కలెక్టర్‌కు ఏమైనా సమస్య చెప్పుకోవాలా? అయితే తిరుచానూరులో టీటీడీ వసతి గృహానికి వెళ్లాలి! విటుంటే ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుందా? జగనన్న ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త జిల్లాల పరిస్థితి ఇలాగే ఉంది. 16 నెలలైనా ఇంకా కంచం ఒకచోట మంచం మరోచోట అన్నట్లు తయారైంది. సమీకృత జిల్లా కార్యాలయాలంటూ ఊదరగొట్టిన జగన్, సందుకో కార్యాలయాన్ని సర్దేసి చేతులు దులుపుకున్నారు. పొరుగున్న తెలంగాణలో 2వేల కోట్లతో సమీకృత కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా మన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటీ నిర్మించలేదు.

Problems_in_Andhra_Pradesh_New_Districts

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 7:23 AM IST

అద్దె భవనాల్లోనే కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు - కొత్త జిల్లాల్లో అధికారుల పాట్లు

Problems in Andhra Pradesh New Districts: కొత్త జిల్లాల ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం జగన్‌ గొప్పగా మాటలు చెప్పారు. కానీ జరిగిందేంటి? 16 నెలలు గడిచినా సమీకృత కార్యాలయ భవన నిర్మాణం ఎక్కడా ప్రారంభం కాలేదు. చాలా చోట్ల కలెక్టర్, ఎస్పీ సహా ప్రభుత్వ విభాగాలు అద్దె కార్యాలయాలు, ఫంక్షన్‌ హాళ్లలోనే నెట్టుకొస్తున్నారు. జిల్లాలు ఏర్పడిన కొన్ని రోజులకే జిల్లా కేంద్రాల్లో ఆస్తుల మార్కెట్‌ విలువల్ని పెంచేసిన ప్రభుత్వం భవనాల నిర్మాణం, వసతుల కల్పనపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

అనకాపల్లి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు సహా 90 శాతం జిల్లా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. కలెక్టర్, జేసీతోపాటు జిల్లా అధికారులంతా అద్దె భవనాల్లోనే నివాసముంటున్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయాలు ఇంకా శాఖ కేంద్రంగానే నడుస్తున్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌ను కొత్తగా నిర్మించిన ఐటీడీఏ కార్యాలయం భవనంలో, ఎస్పీ కార్యాలయాన్ని వైటీసీ భవనంలో ఏర్పాటు చేశారు.

మూతపడిన మిషనరీ పాఠశాల భవనంలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు పలు విభాగాలు అసౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తున్నాయి. కొన్ని విభాగాలు బడిలో పిల్లల బల్లల్నే వినియోగిస్తున్నాయి. నర్సిపురం గ్రామ సచివాలయ భవనంలో నడుస్తున్న జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఇరుకుగా మారి జనాలే వెనుదిరగాల్సి వస్తోంది. ఒకే గదిలో ఏర్పాటైన జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏ అధికారి హోదా ఏంటో, వారి విధులేంటో అర్థంకాని గందరగోళం నెలకొంది.

New Collectorates Construction in AP: ఎన్నికల ముందు కొత్త కలెక్టరేట్ల నిర్మాణంపై వైసీపీ సర్కార్ దృష్టి.. ఇప్పుడు గుర్తొచ్చాయా జగన్ సారూ..?

నెలకు 2 లక్షలకుపైగా అద్దె ఇచ్చి: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు ఎస్పీ కార్యాలయాన్ని నెలకు 2 లక్షలకుపైగా అద్దె ఇచ్చి ఓ ఫంక్షన్‌ హాల్‌లో నడిపిస్తున్నారు. ఇక ఈ జిల్లా కలెక్టరేట్‌ 2 కిలోమీటర్ల దూరంలోని యువజన శిక్షణ కేంద్రంలో ఏర్పాటైంది. దేవదాయ, సాంఘిక, బీసీ సంక్షేమం వంటి విభాగాలకు కార్యాలయాల్లేవు. మరో 8 విభాగాలు డిగ్రీ కళాశాల భవనంలోనే పనికానిస్తున్నాయి. ఇక్కడ కనీసం మరుగుదొడ్లైనా లేక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అధికారులు విశాఖ, అనకాపల్లి, చోడవరం వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. రిజిస్ట్రార్, ఆర్టీవో, వ్యవసాయ, ఉద్యాన, అగ్నిమాపక, దేవదాయశాఖ అధికారులు ప్రతి శుక్రవారం పాడేరులో నిర్వహించే స్పందనకు మాత్రమే హాజరవుతున్నారు. 200 కిలోమీటర్ల నుంచి రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌ వాసులకు జిల్లా కేంద్రానికి రావాలంటే తీవ్ర వ్యయప్రయాసలు తప్పడం లేదు.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ అమలాపురంలోని డీఆర్​డీఏ శిక్షణ కేంద్రంలో ఏర్పాటైంది. అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని ముమ్మిడివరం ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల భవనాల్లో 24 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు పెట్టారు. ఇందుకు నెలకు 12 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. ఎస్పీ కార్యాలయమూ అద్దె భవనంలోనే నడుస్తోంది. చాలా ప్రభుత్వ విభాగాలు ఇంకా కాకినాడలోనే ఉన్నాయి. విద్యుత్‌ శాఖ రాజమహేంద్రవరం కేంద్రంగానే పనిచేస్తోంది. కొన్ని విభాగాలు స్టేషనరీ, ఇతర అవసరాలకు ఓఎన్‌జీసీ, ఇతర సంస్థల్ని బతిమాలుకుని సీఎస్‌ఆర్‌ నిధులతో సమకూర్చుకుంటున్నాయి.

మురుగుకాలువ పక్కనే: తూర్పుగోదావరి కలెక్టరేట్‌ రాజమహేంద్రవరం న్యాక్‌ భవన సముదాయంలో ఏర్పాటైంది. 14 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వైటీసీ నుంచి పనిచేస్తున్నాయి. డీఆర్​డీఏ కార్యాలయం ఆవ మురుగుకాలువ పక్కనే ఏర్పాటు చేయడంతో సిబ్బంది దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారు. డీపీవో ఆఫీస్​లో సుమారు 12 మంది ఒకే గదిలో విధులు నిర్వర్తిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆఫీస్​లో కనీసం ఫర్నిచర్, కంప్యూటర్లు కూడా లేవు. డ్వామా, పరిశ్రమల శాఖ, అగ్నిమాపక, ఇతర కార్యాలయాలు అధ్వానంగా ఉన్నాయి. కలెక్టరేట్‌ వరకు సరైన ప్రయాణ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

లక్ష రూపాయలు బకాయి - అద్దె చెల్లించలేదని సచివాలయానికి యజమాని తాళం

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ను భీమవరానికి 4 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్​కి ప్రధాన రహదారి నుంచి పొలాల మధ్య చాలా దూరం వెళ్లాల్సి రావడంతో జనం అవస్థలు పడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీలు అద్దె భవనాల్లో నివాసం ఉంటున్నారు. విద్యుత్, నీటిపారుదల, సంక్షేమ శాఖల కార్యాలయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కార్యాలయాలు ఏలూరు నుంచే పనిచేస్తున్నాయి.

విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌గా మార్చేశారు. ఇది కార్యాలయ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. బాపట్లలో కలెక్టర్‌కు క్యాంప్‌ కార్యాలయం లేదు. 16 కిలోమీటర్ల దూరంలోని చీరాల ఐఎల్​టీడీ అతిథిగృహం తాత్కాలిక క్యాంప్‌ కార్యాలయం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఏపీహెచ్‌ఆర్‌డీ, పంచాయతీరాజ్‌ శిక్షణ కేంద్రం భవనాలే కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలకు దిక్కయ్యాయి.

మెప్మా, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఒంగోలు కేంద్రంగా, ఉపాధి కల్పన, యువజన సర్వీసుల కార్యాలయాలు గుంటూరు నుంచి పని చేస్తున్నాయి. విద్యుత్‌ శాఖ విభజన జరగలేదు. జిల్లా రవాణాధికారి కార్యాలయం చిన్న ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. మార్కెట్ యార్డు రైతు సమావేశ మందిరాన్ని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి కార్యాలయంగా మార్చారు. జిల్లా ఆర్‌అండ్‌బీ కార్యాలయం లేక అధికారులు తెనాలిలోనే ఉంటున్నారు.

అద్దె కట్టలేదని.. ఆర్బీకేకు తాళం వేసిన భవన యజమాని

ఇరుకు గదుల్లో: పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ను నరసరావుపేట శివారులోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు S.E పరిపాలనాభవనంలో సర్దేశారు. అనుబంధ విభాగాలు, సెక్షన్లను ఇరుకు గదుల్లో కొనసాగిస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ అతిథిగృహాన్ని కలెక్టర్‌ నివాస భవనంగా, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని క్యాంప్‌ కార్యాలయంగా వాడుకుంటున్నారు. వీటి ఆధునికీకరణకు ఉపయోగించిన 3 కోట్ల రూపాయలను దాతలు, వివిధ సంస్థల నుంచి విరాళాల రూపంలో వసూలు చేశారు.

ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా నిర్మించిన పౌష్ఠికాహార కేంద్రంలో జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి విస్తరణపై పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల మధ్య వివాదం తలెత్తింది. చివరకు పోలీసు అనుబంధ విభాగాల్ని శిథిలావస్థలో ఉన్న NSP సిబ్బంది క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. వర్షాలకు అవి కారుతుండటంతో ప్రజల నుంచి చందాలు వసూలుచేసి, రేకుల షెడ్లు నిర్మించారు. విజిలెన్స్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాలు ఇంకా గుంటూరులోనే ఉన్నాయి.

20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది: తితిదే నిర్మించిన వసతిగృహమే తిరుపతి కలెక్టరేట్‌కు దిక్కైంది! మిగతా సంక్షేమ శాఖల కార్యాలయాలు చిత్తూరులోనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీల నివాసాలకు ప్రభుత్వ భవనాలు లేవు. జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని రాజంపేట రోడ్డులో పది శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు వెళ్లాలన్నా, కలెక్టరేట్‌కు రావాలన్నా, రానుపోను 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.

కలెక్టర్, జేసీ, డీఆర్వో, ఎస్పీ, డీఎస్పీ స్థాయి ఆఫీసర్లు మినహా మిగిలిన ఉద్యోగులు, సిబ్బందిలో 70 శాతం మంది ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచే రోజూ వస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాలు 70 శాతం సత్యసాయి ట్రస్ట్‌ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చిన్నపాటి గదుల్లో విధులు నిర్వర్తించాల్సి రావడంతో అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి ఏదైనా సమాచారం కావాలంటే అనంతపురం కలెక్టరేట్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.

జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?

వ్యవసాయ పరిశోధన స్థానంలో కలెక్టరేట్: నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేశారు. ఉపాధి కల్పన, ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో, విద్యుత్‌ SE , ఏపీఐఐసీ, జిల్లా సాగునీటి ప్రాజెక్టుల ముఖ్య కార్యాలయం వంటివి ఇంకా ఏర్పాటవలేదు. రెండు గంటల ప్రయాణమే కావడం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, చాలా శాఖల అధికారులు, ఉద్యోగులు కర్నూలు నుంచే నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు.

తెలంగాణలో: మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమీకృత భవన సముదాయాలను నిర్మించింది. 2019 నుంచి తొలిదశలో 25 సమీకృత భవన సముదాయాల నిర్మాణం తలపెట్టగా ఇప్పటికే 24 ప్రారంభించారు. మిగిలిన ఆ ఒక్కటీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండోదశలో చేపట్టిన 5 సముదాయాల్ని 2024 చివరికల్లా ప్రారంభించాలన్నది లక్ష్యం. మొత్తం 30 జిల్లాల్లో కలిపి 50 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్మిస్తున్నారు.

ప్రతి సముదాయానికి 19 నుంచి 54 ఎకరాలు కేటాయించారు. ఒక్కో సముదాయంలో ఐదు నుంచి ఆరంతస్తుల్లో భవనాలు నిర్మించారు! అత్యాధునిక లిఫ్ట్‌లు, సీసీ కెమెరాలు, ఉద్యోగుల భోజనాలకు ప్రత్యేక హాలు, క్యాంటీన్‌ సహా సకల ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ల ప్రాంగణంలో హెలిప్యాడ్‌, ఉద్యోగులకు వర్క్ స్టేషన్లు కూడా నిర్మించారు! సమీకృత కలెక్టరేట‌్లంటే ఇలా ఉండాలి జగన్‌ సార్! చెట్టుకోశాఖ, పుట్టకో కార్యాలయం అంటే ప్రజలకు పాలన చేరువ చేయడం కాదు, ప్రహసనానికి గురిచేయడం.

రోగుల అవస్థలు పట్టించుకోని ప్రభుత్వం - ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కరవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.