ETV Bharat / politics

రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకత - కూటమిదే హవా - Rajamahendravaram Constituency - RAJAMAHENDRAVARAM CONSTITUENCY

Political Review on Rajamahendravaram Parliament Constituency: రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 7 శాసనసభ స్థానాల్లో విస్తరించి ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో పార్లమెంట్ పరిధిలో రైతులు తీవ్ర కష్టాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంట్‌ వాసులు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

rajamahendravaram_constituency
rajamahendravaram_constituency (ఈటీవీ భారత్ ప్రత్యేకం)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 9:20 PM IST

Political Review on Rajamahendravaram Parliament Constituency: గోదావరి తీరానికి పక్కనే ఉండే రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో ఉద్ధండులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఈసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బరిలో నిలిచారు. వైసీపీ తరపున ఈసారి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ తొలిసారి ఎంపీగా పోటీచేస్తున్నారు.

వైసీపీ పాలనలో పార్లమెంట్ పరిధిలో ఐదేళ్లు రైతులకు తీవ్ర కష్టనష్టాలు తప్పలేదు. అభివృద్ధి పడకేసింది. ఇసుక, గ్రావెల్ దోపిడీ, వరద నీటితో మునిగిపోయే ఆవ భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధ్వంసమైన రహదారులకు కనీస మరమ్మతులు చేయకపోవడం, రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, గోదావరి ప్రతిష్ఠాత్మక వంతెనల అస్తవ్యస్త నిర్వహణతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఈ పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంట్‌ వాసులు కూటమికి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు.

'హే కృష్ణా' చరిత్ర పునరావృతమేనా? - వారు అసెంబ్లీలో అడుగుపెట్టలేరా! - Tension in ministers

ప్రాతినిధ్యం వహించిన మహావహులు: రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 7 శాసనసభ స్థానాల్లో విస్తరించి ఉంది. రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. 1952లో తొలిసారి ప్రజా సోషలిఫ్ట్ పార్టీ అభ్యర్థి నల్లారెడ్డి నాయుడు గెలిచారు. డాక్టర్‌ కల్నల్‌ రాజు, ఎస్పీబీకే సత్యనారాయణరావు వంటి మహామహులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఎస్పీబీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.

ఉండవల్లి అరుణ్‌కుమార్ రెండుసార్లు, సినీనటుడు మురళీమోహన్‌ ఒక్కసారి రాజమహేంద్రవరం స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మార్గాని భరత్‌రామ్‌ ఎంపీగా గెలిచారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా పదిసార్లు జయకేతనం ఎగురేశారు. తెలుగుదేశం అభ్యర్థులు మూడుసార్లు, తెలుగుదేశం మద్దతుతో బీజేపీ అభ్యర్థులు రెండుసార్లు విజయం సాధించారు.

పురందేశ్వరి సుడిగాలి పర్యటనలు: రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 16 లక్షల 23 వేల 149 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7లక్షల 92వేల 317, మహిళలు 8లక్షల 30వేల 735 మంది. అత్యధికంగా బీసీ ఓటర్లు ఉండటం ఈ స్థానం ప్రత్యేకత. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్న ఎస్సీలు, కమ్మ, కాపు సామాజిక వర్గీయులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. కొవ్వూరు, గోపాలపురం శాసనసభ స్థానాలు ఎస్సీలకు కేటాయించగా మిగతా ఐదు జనరల్‌ సీట్లు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానంలో ఈసారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తరఫున ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు దగ్గుపాటి పురందేశ్వరి పోటీలో ఉన్నారు.

ఏడు అసెంబ్లీ స్థానాల్లో సంస్థాగతంగా తెలుగుదేశం బలంగా ఉండటం, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయడంతో కూటమికి విజయం సునాయాసమన్న సానుకూలత వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరి ఏడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అదే సమయంలో వైద్యుడిగా సేవలు అందిస్తున్న గూడూరి శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దించింది. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తామని చెప్పి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాననడంతో గూడూరిని ఎంపీగా పోటీలో నిలిపారు. బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి ఏడు నియోజకవర్గాల్లో దూసుకెళ్తుండగా వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పోటీలో వెనకబడ్డారు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉనికి కోసం పోరాడుతున్నారు.

ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైఎస్సార్సీపీ - తాయి'లాలిస్తూ' అడ్డదారిలో ఎన్నికల ప్రచారం - YSRCP Distribute Gifts to Voters

జగన్‌ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత: రాజమహేంద్రవరం నగర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆదిరెడ్డి వాసుపై ఎంపీ భరత్‌ వైసీపీ తరఫున పోటీలో నిలిచారు. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న రాజమహేంద్రవరం అర్బన్‌లో జగన్‌ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నగరంలో డ్రైనేజీ, మురుగు నీటి ముంపు, రహదారుల విస్తరణ వంటి పలు సమస్యలుండగా అవసరం లేని పనులు కమీషన్‌ కోసం చేపట్టారని భరత్‌పై తెలుగుదేశం నాయకులు విమర్శలు గుప్పించారు.

ఈ స్థానంలో తెలుగుదేశం గెలుపు తథ్యమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రూరల్ నియోజకవర్గంలో సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోరుగా దూసుకెళ్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్, రూరల్‌ స్థానాల నుంచి బుచ్చయ్య ఆరుసార్లు విజయం సాధించారు. బుచ్చయ్య చౌదరిపై రామచంద్రాపురం నుంచి బదిలీపై తీసుకొచ్చిన మంత్రి వేణుగోపాలకృష్ణను పోటీలో నిలిపారు. 78 ఏళ్ల వయస్సులో మంచి జోరుమీదున్న బుచ్చయ్య గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.

ఉత్కంఠ పోటీ: అనపర్తిలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం తొలుత అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత ఇదే సీటుని బీజేపీ అభ్యర్థికి కేటాయించారు. నల్లమిల్లికే సీటు దక్కుతుందని ప్రచారం సాగినా చివరకు ఆయన బీజేపీ తరఫున నామినేషన్ వేశారు. రామకృష్ణారెడ్డి తండ్రి మూలారెడ్డి నుంచి 42 ఏళ్లుగా వీరి కుటుంబం తెలుగుదేశంలో ఉంది. ఈసారి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆయనకు సానుభూతి పెరిగింది. వైసీపీ తరఫున డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇరుపార్టీల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది.

జగనన్న మద్యం దుకాణాలు - ఉమ్మడి అనంతలో 33వేల మంది ఆస్పత్రి పాలు - ap liquor brands

ముప్పిడి గెలుపు ఖాయం: నిడదవోలులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉండటం, నియోజకవర్గ ఇంఛార్జ్‌ బూరుగుపల్లి శేషారావు పూర్తి సహకారం అందిచండంతో దుర్గేష్‌ గెలుపు ఖాయమనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వైసీపీ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడుకే అవకాశం దక్కింది. ఎస్సీ స్థానాలైన కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావుని తెలుగుదేశం బరిలో నిలపగా వైసీపీ తరఫున గోపాలపురం నుంచి బదిలీపై వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశానికి సానుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ముప్పిడి గెలుపు దాదాపు ఖాయమైంది.

స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి: గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజును తెలుగుదేశం పోటీలో నిలపగా వైసీపీ తరఫున హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి ఇక్కడికి బదిలీ చేశారు. ఈ స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలమైనది కావడంతో ఆ పార్టీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుకే గెలుపు దక్కే అవకాశం ఉంది. రాజానగరం నుంచి కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఈయనకు రాజానగరం తెలుగుదేశం ఇంఛార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి పూర్తి మద్దతు ప్రకటించారు.

వైసీపీ పాలనలో రాజమహేంద్రవరం నగరం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదనే భావన ప్రజల్లో ఉంది. దీంతో పాటు నగరంలో పేదలకు టిడ్కో గృహాలు కేటాయించకపోవడం, పిల్ల గోదావరిగా పిలిచే బూరుగుపూడి ఆవలో ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు ఒక్క ఇళ్లూ నిర్మించకపోవడంపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అలాగే గోదావరి తీరమంతా ఇసుక దోపిడీ ఐదేళ్లుగా యథేచ్చగా సాగింది. గోదారమ్మ చెంతనే ఉన్నా సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ రంగంపై ఆధారపడ్డవారు ఉపాధి లేక తీవ్ర అవస్థలు పడ్డారు.

టీడీపీ-జనసేన Vs వైఎస్సార్సీపీ మేనిఫెస్టో - ప్రజల స్పందన ఎలా ఉందంటే - NDA Manifesto VS YsrCP Manifesto

శృతి మించిన బ్లేడ్​ బ్యాచ్​ ఆగడాలు: సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక నగరి రాజమహేంద్రవరంలో బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌ ఆగడాలు ఈ ఐదేళ్లలో శృతి మించాయి. బ్లేడ్‌ బ్యాచ్‌లకు వైసీపీ నాయకులే కొమ్ము కాయడంతో పోలీసులు నియంత్రించలేని దుస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రకృతి విపత్తులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా కౌలుదారులకు పరిహారం అందలేదు. సకాలంలో ధాన్యం డబ్బులు జమచేయకుండా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. అలాగే కొవ్వూరు మండలం దొమ్మేరులో ఎస్సీ యువకుడు ఆత్మహత్యకు హోంమంత్రే కారణమంటూ తీవ్ర వివాదం నెలకొంది.

పరామర్శకు వచ్చిన హోంమంత్రి వనితను ఎస్సీలే ప్రతిఘతించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. నిత్యావసరాలు, కరెంట్‌, ఆర్టీసీ బిల్లులు, చెత్త పన్నులు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు బాదడంతో రాజమహేంద్రవరం సహా పట్టణ ప్రజలు అల్లాడిపోయారు. అలాగే గోదావరిపై ప్రత్మిష్ఠాత్మక వంతెనలు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ, రోడ్‌ కం రైలు బ్రిడ్జి, గామన్‌ వంతెన నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఫలితంగా వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ పరిస్థితులన్నీ వైసీపీకి తీవ్ర ప్రతిబంధకంగా మారగా కూటమి అభ్యర్థులు నూతనోత్సాహంతో దూసుకెళ్తున్నారు.

రాజమహేంద్రవరంలో వైఎస్సార్సీపీకి వ్యతిరేకత (ఈటీవీ భారత్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.