ETV Bharat / politics

'జగన్‌ ఆస్తులను జాతీయం చేసి ప్రజలకు పంచాలి - భూ కేటాయింపులు రద్దు చేయాలి'

సొంత తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లటం జగన్ క్రూర మనస్తతత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

tdp_mla_somireddy_comments_on_ys_jagan
tdp_mla_somireddy_comments_on_ys_jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

TDP MLA Somireddy Comments on YS Jagan : ఆస్తి కోసం తల్లి, చెల్లినే జగన్‌ బెదిరించడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. తల్లి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లడం జగన్ క్రూర మనస్తత్వానికి నిదర్శనమన్నారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదేనని అందులో కనీసం మూడో వంతు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతి పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజును అడ్డగోలుగా పొడిగించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు పరిశ్రమ ప్రారంభించలేదని గుర్తు చేశారు. చట్ట వ్యతిరేకంగా చేసిన భూకేటాయింపులు, లీజులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

YS Jagan Vs YS Sharmila : భూ కేటాయింపులను ఎందుకు ప్రభుత్వం రద్దు చేయకూడదని నిలదీశారు. నిబంధనలకు విరుద్ధంగా సరస్వతి పవర్ యాజమాన్యం వ్యవహరించినందున భూ కేటాయింపులు రద్దు చేయాలని సీఎం చంద్రబాబుని కోరారు. జగన్ ఒప్పుకుంటే సరస్వతీ పవర్ 1500ఎకరాలను 3 భాగాలు చేసి ఒక భాగం రైతులకిచ్చి మిగిలిన 2భాగాలు జగన్, షర్మిలకు సమానంగా పంచుతామని హెచ్చరించారు. తండ్రిని ఈడీ కేసులో ఇరికించి, ఆస్తి కోసం తల్లీ-చెల్లిపై కేసు పెట్టడం ఎక్కడా చూడలేదని విమర్శించారు.

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌

Jagan and YS Sharmila Property Disputes : అలాంటి జగన్ నోట తల్లీ, చెల్లీ అనే మాటలు వినలేకపోతున్నామన్నారు. ప్రజల ఆస్తులు కూడగట్టుకున్న జాబితాలో జగన్​ది దేశంలో 2వ స్థానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​కు కాంగ్రెస్​తో విభేదాలున్నాయని తెలియజేయడానికి ఈ నాటకం అడుతున్నారేమో అని ఆరోపించారు. దీనిపై కేంద్రం ఎక్కడ కన్నెర్ర చేస్తుందోననే భయంతో చెల్లికి రాసిన లేఖలు బయటకు వదిలి జగన్ ఆడే నాటకం కావొచ్చని ఆరోపించారు. ఏ తల్లైనా తన పిల్లలందరినీ సమానంగా చూసుకుంటుందని హితవు పలికారు. కానీ జగన్ క్రూరత్వం గ్రహించిన విజయమ్మ షర్మిలతోనే ఉండాల్సి వస్తోందన్నారు. జగన్ క్రూరత్వాన్ని ఓ దర్శకుడు సినిమా సన్నివేశం తీశాడంటూ సోమిరెడ్డి వీడియో ప్రదర్శించారు.

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇబ్బందులు పెడుతున్నారని పలువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిరువురు రాసుకున్న లేఖల్లో అంశాలు చర్చనీయాంశమయ్యాయి.​

Y.S. విజయమ్మ ఒప్పుకుంటే జగన్‌ బాధితుల సంఘానికి అధ్యక్షురాలిని చేస్తానని మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. సొంత తల్లి, చెల్లిని కోర్టు ద్వారా ఇబ్బంది పెడుతున్న జగన్‌ చరిత్ర హీనుడిగా నిలవబోతున్నారన్నారు. గతంలో జగన్‌ ఆస్తులు ఎంత? ఇప్పుడు వాటి విలువ ఎంత? అనే అంశాలను ప్రజలకు తెలపాలన్నారు. జగన్‌ ఆస్తులను జాతీయం చేసి ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఓ చెల్లి కన్నీటి గాథ - అన్నపై ఎక్కుపెట్టిన బాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.