ETV Bharat / politics

స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం- పవన్‌ - Pawan on Govt Schemes Names - PAWAN ON GOVT SCHEMES NAMES

Pawan on Govt Schemes with Names of Inspiring Providers: భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై ఉపముఖ్యమంత్రి పవన్ హర్షం వ్యక్తం చేశారు. స్ఫూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయం అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.

Pawan_on_Govt_Schemes_with_Names_of_Inspiring_Providers
Pawan_on_Govt_Schemes_with_Names_of_Inspiring_Providers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 12:18 PM IST

Pawan on Govt Schemes with Names of Inspiring Providers: స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం హర్షణీయమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. విద్యాశాఖ పథకాలను సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్​కు అభినందనలు తెలిపారు.

గత ప్రభుత్వ పాలనలో పథకాలన్నింటికీ అప్పటి ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆ దుస్సంప్రదాయాన్ని పక్కనబెట్టి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే వారి పేర్లతో పథకాల అమలు మంచి పరిణామం అన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశనం చేస్తుందన్నారు.

మడ అడవులు విధ్వంసం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు : పవన్ కల్యాణ్ - Pawan on Mada Forests Protection

మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారని, అందుకు భిన్నంగా ఇప్పుడు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలని కోరారు. ఏ వేళలో అయినా కడుపునిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ అని, ఆమె దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియజేస్తే ఆ సద్గుణాలు అలవడతాయని అన్నారు.

మన దేశపు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని పవన్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ మహనీయుల దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

గాంధీ ఫొటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారు- పంచాయతీల సొమ్ము డిస్కంలకు మళ్లించారు : మంత్రి పవన్​ - PAWAN KALYAN speech in assembly

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.