Pawan Kalyan Speech at Varahi Vijayatra Meeting in Vijayawada: రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై లైంగికదాడి జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ పాల్గొన్నారు. మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం యువతకు పెద్ద పీట వేస్తుందని చెప్పారు. కేశినేని చిన్ని దమ్మున్న వ్యక్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
ప్రతి వ్యక్తికి ఓటు చాలా ముఖ్యమని అలాంటి ఓటును బాధ్యతతో వేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీలందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాద యాత్ర సమయంలో జగన్ ఎంతో మందికి ఎన్నో హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చకుండా మాటతప్పారని విమర్శించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలని వారి ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో వినిపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. మీకు దగా చేసే ప్రభుత్వం కావాలో మీ భవిష్యత్తు కోసం పని చేసే ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.
మీ భూ పత్రాలపై రాజముద్ర కావాలా - జగన్ ఫొటో కావాలా?: చంద్రబాబు - Chandrababu accused CM Jagan
కేశినేని చిన్ని దమ్మున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఓటు అందరికీ ఎంతో ముఖ్యమైనది అలాంటి ఓటు చాలా బాధ్యతతో వేయాలి. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయి. నేను మైనార్టీలందరికీ అండగా ఉంటాను. మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో కచ్చితంగా తోడ్పడుతుంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని యువతను మోసం చేసింది. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం యువతకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో అమ్మాయిపై మానభంగం జరిగితే ఆ నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదు. అంతే కాకుండా రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇలాంటి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. హామీలను నెరవేర్చకుండా జగన్ మాటతప్పారు.- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఆంధ్రాకు 50 ప్రత్యేక రైళ్లు - SPECIAL TRAINS schedule