ETV Bharat / politics

అంతుచిక్కని సింహపురి రాజకీయం - ఎవరిని వరించేనో విజయం - Nellore LOK SABHA ELECTIONS - NELLORE LOK SABHA ELECTIONS

Nellore constituency : పెన్నా నది ఒడ్డున ఉన్న నెల్లూరును విక్రమ సింహపురి అని కూడా పిలుస్తుంటారు. సింహపురిగా రాజకీయాలు ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అవహేళనకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఈ జిల్లా వారే.

అంతుచిక్కని సింహపురి రాజకీయం- ఎవరిని వరించేనో విజయం!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 12:24 PM IST

Nellore constituency : నెల్లూరు అనగానే మత్య్స సంపద గుర్తుకొస్తుంది. నెల్లూరు చేపల పులుసు వంటకం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగో నగరమైన నెల్లూరు పెన్నా నది ఒడ్డున సముద్రానికి సమీపంలో ఉంటుంది. సుందరమైన బీచ్‌లు, చారిత్రక కోటలు, దేవాలయాలు, దర్గాలు, పక్షులు, వన్యప్రాణుల అభయారణ్యాలకు ప్రసిద్ధి. స్వర్ణాల చెరువు ఒడ్డున ఉన్న బారా షహీద్ దర్గా వద్ద జరుపుకొనే రొట్టెల పండుగకు పలు రాష్ట్రాల నుంచి తరలి వస్తుంటారు. ఉర్సులో భాగంగా కులమతాలకతీతంగా రొట్టెలను మార్చుకుంటారు.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు

  1. కందుకూరు
  2. కావలి
  3. ఆత్మకూరు
  4. కోవూరు
  5. నెల్లూరు సిటీ
  6. నెల్లూరు రూరల్‌
  7. ఉదయగిరి

తాజా గణాంకాల ప్రకారం ఓటర్ల వివరాలు

  • మొత్తం ఓటర్లు 16,79,359
  • పురుషులు 8,23,699
  • మహిళలు 8,55,476
  • ట్రాన్స్‌జెండర్లు 184
nellore_loksabha
nellore_loksabha

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం (Nellore Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. 2009 ఎన్నికల నుంచి జనరల్‌ కేటగిరికి మార్చారు. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా, 13సార్లు కాంగ్రెస్‌ పార్టీ, రెండుసార్లు తెలుగుదేశం, రెండు సార్లు వైఎస్సార్సీపీ విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కొప్పుల రాజు పోటీ చేస్తున్నారు.

నెల్లూరు లోక్‌సభ ఎంపీలు వీరే :

1952లో తొలి సారి జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బెజవాడ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ బోణీ కొట్టింది. బి.అంజనప్ప, ఆర్ఎల్ఎన్‌రెడ్డి (కాంగ్రెస్), 1962: బి.అంజనప్ప (కాంగ్రెస్), 1967: బి.అంజనప్ప (కాంగ్రెస్), 1971: డి.కామాక్షయ్య (కాంగ్రెస్), 1977: డి.కామాక్షయ్య (కాంగ్రెస్), 1980: డి.కామాక్షయ్య (కాంగ్రెస్), 1983: పి.పెంచలయ్య (తెలుగుదేశం), 1984: పి.పెంచలయ్య (తెలుగుదేశం) విజయం సాధించారు.

గత ఎన్నికల్లో విజేతలు - సమీప అభ్యర్థులు

1989: పి.పెంచలయ్య ( కాంగ్రెస్) - ఎం.నాగభూషణమ్మ (టీడీపీ)

1991: కె.పద్మశ్రీ (కాంగ్రెస్) - ఎం.నాగభూషణమ్మ (టీడీపీ)

1996: పనబాక లక్ష్మి (కాంగ్రెస్) - టి.పి.భానురాజు (సీపీఎం)

1997: పనబాక లక్ష్మి (కాంగ్రెస్) - బుదురు స్వర్ణలత (సీపీఎం)

1999: ఉక్కాల రాజేశ్వరమ్మ (తెలుగుదేశం) - పనబాక లక్ష్మి (కాంగ్రెస్)

2004: పనబాక లక్ష్మి (కాంగ్రెస్) - కారుపోతుల బాలకొండయ్య (బీజేపీ)

2009: మేకపాటి రాజమోహన్‌రెడ్డి (కాంగ్రెస్) - వంటేరు వేణుగోపాల్​రెడ్డి​ (టీడీపీ)

2014: మేకపాటి రాజమోహన్‌రెడ్డి(వైఎస్సార్సీపీ) - టీ.సుబ్బరామిరెడ్డి​ (కాంగ్రెస్)

2014: మేకపాటి రాజమోహన్‌రెడ్డి(వైఎస్సార్సీపీ) - ఆదాల ప్రభాకర్​రెడ్డి (టీడీపీ)

2019: ఆదాల ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ) - బీద మస్తాన్​రావు (టీడీపీ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.