ETV Bharat / politics

మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్డీఏ నేతలు - NDA Leaders on Liquor Ban IN AP - NDA LEADERS ON LIQUOR BAN IN AP

NDA Leaders on CM Jagan Liquor Ban Promises: పాదయాత్రలో భాగంగా మద్య నిషేధం అన్న జగన్ అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు సంపాదించారని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. మద్యం నిషేధం అంశంపై కూటమి నేతలు మంగళగిరిలో సమావేశం నిర్వహించారు.

NDA_Leaders_on_CM_Jagan_Liquor_Ban_Promises

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 1:46 PM IST

Updated : Apr 11, 2024, 4:31 PM IST

మద్యంతో జగన్‌కు ఆదాయం కిక్కు - పేదల ప్రాణాలకు ముప్పు: ఎన్డీఏ నేతలు

NDA Leaders on CM Jagan Liquor Ban Promises: మద్య నిషేధం అన్న జగన్​ అదే మద్యంపై లక్ష కోట్లు సంపాదించారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్ డబ్బు పిచ్చికి పెదవాళ్లు బలి అయిపోయారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక కమిషన్ వేసి అన్నింటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇప్పుడు తప్పులు చేసిన అధికారులు రేపు కోర్టుల్లో నిలబడక తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్​లో మద్యం నిషేధం హామీపై ఎన్డీఏ నేతలు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మద్యంపై వచ్చే ఆదాయంతో జగన్​కు కిక్కు, పేద ప్రజల ప్రాణాలకు ముప్పు అని నేతలు అన్నారు. మహిళల తాళిబొట్లు తెంచడమే జగన్ అజెండా అని నేతలు ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేరాఫ్ అడ్రస్​గా మారిందని ఆరోపించారు.

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Condemn Attack on tdp

గోవా నుంచి లిక్కర్​ తెప్పించి నెల్లూరులో అమ్మేంతగా వైసీపీ నేతలు బరితెగించారని మండిపడ్డారు. భవిష్యత్తులో మద్యం నిషేధించకుండా బ్యాంకుల్లో మందుబాబుల నుంచి వస్తున్న ఆదాయాన్ని తనఖా పెట్టి 40 వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నగదు అంతా ఎవరి జేబుల్లోకి పోయాయని ప్రశ్నించారు. సంవత్సరానికి దాదాపు 56 నుంచి 57 కోట్ల రూపాయల ఆదాయం మద్యం నుంచి వస్తుంటే ప్రభుత్వ లెక్కల్లో కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే కన్పిస్తున్నాయని తెలిపారు.

సంవత్సరానికి దాదాపు రూ.25వేల కోట్ల చొప్పున వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు జగన్ ఖజానాలోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఇలా మద్యంలో లక్షల కోట్లు జగన్ దోచుకుని సూటుకేసులతో సొమ్మును కంపెనీలకు తరలించారని ఆరోపించారు. మద్యం, గంజాయి జగన్ ఆదాయ వనరులని విమర్శించారు. మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పిన జగన్ నేడు మేనిఫెస్టో తుంగలో తొక్కాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్య నియంత్రణ కూటమి చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు.

"మద్యనిషేధం అన్నారు, అదే మద్యంపై సీఎం జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారు. జగన్ డబ్బు పిచ్చికి పేదవాళ్లు బలైపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన అధికారులు రేపు కోర్టుల్లో నిలబడక తప్పదు. మద్యంలో లక్షల కోట్లు జగన్ దోచేసి సూట్‌కేసు కంపెనీలకు తరలించారు. మద్యం, గంజాయి రెండూ జగన్‌కు ఆదాయ వనరులు. మేనిఫెస్టో ఖురాన్ అన్న జగన్ నేడు తుంగలో తొక్కారు. మద్య నియంత్రణను కూటమి చేసి చూపిస్తుంది." - ఎన్డీఏ నేతలు

గెలుపు కోసం వైసీపీ కుయుక్తులు- ఓట్లు తమకే వేయించాలని తాయిలాల ఎర - YSRCP Distribute Gifts to MEPMA RPs

Last Updated : Apr 11, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.