Nandamuri Balakrishna Election Campaign: సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని హిందూపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం పులమతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణకు మహిళలు అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. సమసమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్న బాలకృష్ణ వైసీపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలకు మోసపోవద్దని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం చాలా ముఖ్యమని సమర్థవంతమైన పాలన అందించే వ్యక్తికే మీ ఓటు వేయండని అన్నారు. మీ బాగోగులు చూడని వైసీపీ నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలలోకి వస్తే గట్టిగా నిలదీయండని అన్నారు.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు - నిందితుడిని కస్టడీకి కోరిన పోలీసులు - Cm Jagan Stone Pelting Case
సమసమాజ స్థాపనకు ప్రజలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని బాలకృష్ణ అన్నారు. వైసీపీ వాళ్లు చెప్పే అబద్దాలకు మోసపోయి మీ స్వార్థం కోసం, సప్రయోజల కోసం త్యాగం చెయ్యొద్దని సూచించారు. వైసీపీ ఆగడాలను అరికట్టండి లేదంటే వ్యవస్థలను మీ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లు అవుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లా రైతులకు సబ్సిడీతో బిందు, తుంపర సేద్య పరికరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలో పర్యాటకుల సౌకర్యార్థం టూరిజం ఏర్పాటు చేశామని లేపాక్షిలో నంది ఉత్సవాలు జరిపింది తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధి చేస్తామని బాలకృష్ణ హామీఇచ్చారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగులకు అవమానాలు - జీతాల కోసం నిరసనలు - Jagan Govt Games with Employees
జగన్ కుప్పానికి నీళ్లు తీసుకొస్తామని ప్రజలకు చెప్పి సినిమా సెట్టింగ్ ఏర్పాటు చేశారని బాలకృష్ణ అన్నారు. గేట్లను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి రాత్రికి రాత్రే గేట్లను ఎత్తివేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అవినీతి చేయడంలో ఆరితేరాడని అతనొక జగమెరిగిన జగన్నాటకుడని విమర్శించారు. జగన్ కల్తీ మద్యం ద్వారా లక్షల కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. అంతే కాకుండా ఈ కల్తీ మద్యం ద్వారా లక్షలాదిమంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచాడని ఆరోపించారు. గడచిన ఐదేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనతో ఎంతో మందిని పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.
మాస్క్‌లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను హత్యచేశారని, ప్రశ్నించినందుకు రామకృష్ణకు శిరోముండనం చేయించారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రజలు కూడా తిరగబడడంతో పరుగులు తీశారని అన్నారు. హిందూపురం మండలంలో 2800 టిడ్కో ఇళ్లు కట్టించి అందరికీ ఇస్తామన్న జగన్ ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీని ప్రజలు ఆదరిస్తున్న విధానాన్ని చూసి వైసీపీకి వణుకు వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు తనతోపాటు ఎంపీ అభ్యర్థి బీకే. పార్థసారధిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను బాలకృష్ణ అభ్యర్థించారు.