ETV Bharat / politics

'ఆదిలాబాద్‌ వేదికగా మోదీ, రేవంత్‌ల బడే భాయ్, చోటా భాయ్‌ బంధం బహిర్గతమైంది' - Palla comments on adilabad meeting

MLA Palla Fires on CM Revanth Reddy : ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని, కాంగ్రెస్, బీజేపీల మధ్య సంబంధం బహిర్గతమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందన్న ఆయన, ఆ రెండు పార్టీలు అనేక మున్సిపాలిటీల్లో చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని పార్లమెంట్‌లో కేంద్రమే చెప్పిందన్న ఆయన, ఇప్పుడు మోదీ విభిన్నంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

MLA Palla rajeshwar reddy
MLA Palla Fires on CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 5:47 PM IST

MLA Palla Fires on CM Revanth Reddy : ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని, బడే భాయ్, చోటా భాయ్ మధ్య సంబంధం బహిర్గతమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడిందన్న ఆయన, ఎన్నికలకు ముందు రహస్యంగా ఉన్న బంధం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం అడగ్గానే రూ.13 వేల కోట్ల ప్రత్యేక రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని పల్లా పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలు మొదలు, ఉప ఎన్నికల్లోనూ బడే భాయ్, చోటా భాయ్ బంధం కొనసాగుతోందని అన్నారు.

రాహుల్‌కు భిన్నంగా తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉందన్న పల్లా, గుజరాత్ నమూనా కావాలని రేవంత్ కోరుకుంటున్నారంటే కాంగ్రెస్, రాహుల్ విధానాలతో విభేదిస్తున్నట్లేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలకు వెళ్లి, మోదీకి మోకరిళ్లుతున్నారని ఆక్షేపించారు. మేనిఫెస్టోలో పెట్టిన పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా అడిగేందుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ప్రజల చెవిలో రేవంత్ క్యాల్లీఫ్లవర్ పెడితే, మోదీ కమలం పువ్వు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి'

ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్, చోటా భాయ్ బంధం బహిర్గతమైంది. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం బయటపడింది. రేవంత్ ప్రభుత్వం అడగ్గానే రూ.13 వేల కోట్ల ప్రత్యేక అప్పునకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికలు మొదలు, ఉప ఎన్నికల్లోనూ బడే భాయ్, చోటా భాయ్ బంధం కొనసాగుతోంది. రాహుల్‌కు భిన్నంగా తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఉంది. - పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

'ఆదిలాబాద్‌ వేదికగా మోదీ, రేవంత్‌ల బడే భాయ్, ఛోటా భాయ్‌ బంధం బహిర్గతమైంది'

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదని పార్లమెంట్‌లో కేంద్రమే చెప్పిందన్న పల్లా, ఇప్పుడు మోదీ విభిన్నంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, రేవంత్ రాజకీయాలు పక్కన పెట్టి, రైతులకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గుజరాత్‌లో మోర్బీ ఆనకట్ట కూలిపోయి 140 మంది చనిపోయారని, ఇక్కడ ఒక్క పిల్లర్ కుంగితేనే కుంభకోణం అంటున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ బీజేపీకి కాంగ్రెస్, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు భారతీయ జనతా పార్టీ సహాయం చేయబోతోందని పల్లా అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు లేరని, తమ పార్టీ నేతలను బెదిరించి, బతిమాలి వారి పార్టీల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. అన్నింటినీ అధిగమించి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Palla Rajeshwar Reddy On CM KCR : కేసీఆర్ తెలంగాణ గాంధీ.. ఎమ్మెల్సీ పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.