ETV Bharat / politics

వైఎస్సార్సీపీ 12వ జాబితా - చిలకలూరిపేట, గాజువాక ఇన్​ఛార్జ్​ల ప్రకటన - 12th list of YSRCP

YSRCP 12th List: వైఎస్సార్సీపీలో సమన్వయకర్తల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేటకు కావటి మనోహర్‌నాయుడు, గాజువాకకు మంత్రి అమర్‌నాథ్‌ పేర్లను ప్రకటిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

YSRCP 12th List
YSRCP 12th List
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 10:53 PM IST

YSRCP 12th List: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో పాటుగా, గతంలో ప్రకటించిన అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే 11 జాబితాల్లో పలువురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైఎస్సార్సీపీ అధిష్టానం, తాజాగా 12వ జాబితాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించింది. అందులో చిలకలూరిపేట అభ్యర్థి మల్లెల రాజేష్‌ నాయుడు స్థానంలో మనోహర్ నాయుడి పేరును ప్రకటించగా, గత కొంత కాలంగా టికెట్ కోసం ఎదురు చూస్తున్న మంత్రి అమర్నాథ్​ను గాజువాక వైఎస్సార్సీపీ సమన్వయ కర్తగా నియమిస్తూ వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

ఎట్టకేలకు గుడివాడ అమర్నాథ్ పేరు: వైఎస్సార్సీపీ అదిష్టానం మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్​కు టికెట్ కేటాయించే విషయమై ఆలస్యమైంది. తాజాగా అమర్నాథ్​ను గాజువాక సమన్వయకర్తగా ప్రకటిస్తూ వైఎస్సార్సీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. మెుదటి లిస్ట్ నుంచి అమర్నాథ్ పేరు ఉంటుందో, ఉండదోననే ఉత్కంఠ కొనసాగింది. అయితే, వైఎస్సార్సీపీ పెద్దలు అప్పట్లో అమర్నాథ్​కు ఇచ్చే అంశంపై నిరాసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుడివాడ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్న వేళ 'కొడిగుడ్డు డైలాగ్​తో ఫేమస్' అయిన మంత్రికి ఎట్టకేలకు వైఎస్సార్సీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. 11 జాబితాల్లో తన పేరు కోసం నిరీక్షించిన మంత్రి అమర్నాథ్​కు, సీఎం జగన్ పన్నెండో జాబితాలో మోక్షం ప్రసాదించారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణారెడ్డి

రాజేష్‌ నాయుడు స్థానంలో మనోహర్ నాయుడు: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో భాగంగా, మెుదట రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆమె స్థానంలో మల్లెల రాజేష్‌ నాయుడుని మూడు నెలల క్రితం ఇంఛార్జిగా ప్రకటించారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న మల్లెల రాజేష్‌ నాయుడు పేరును ఖరారు చేయగా, తాజాగా అతని స్థానంలో మనోహర్ నాయుడి పేరును ఖారారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసున్నారు.

మారిన రాజకీయ సమీకరణాలు: చిలకలూరిపేటలో తాజా పరిస్థితుల ప్రకారం రాజేష్‌ నాయుడు సరిపోరని వైఎస్సార్సీపీ అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పేరును చిలకలూరిపేట బాధ్యుడిగా ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రెండుసార్లు మనోహర్‌ నాయుడుని వైఎస్సార్సీపీ అగ్రనాయకత్వం పిలిపించుకుని చిలకలూరిపేట టికెట్‌ విషయంపై మాట్లాడిన నేపథ్యంలో రాజేష్ నాయుడు మంత్రి విడుదల రజినిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి రజిని తన దగ్గర 6.5 కోట్లు తీసుకుందని ఆరోపించారు. టీడీపీ తరఫున చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.