Minister Anitha Comments on MP Vijayasai Reddy: తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డిపై తప్పకుండా కేసులు నమోదు చేస్తామన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి జగన్ అండ్ కో రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేవిధంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని కూటమికి అధికారం ఇచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు.
Anita Visit Vijayawada Sub Jail: ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలని తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కచ్చితంగా నిఘా ఉంటుంది చర్యలు తప్పవని అన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని తెలిపారు విజయవాడ సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించిన మంత్రి అనిత ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీసామని అన్నారు. జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై తనిఖీ చేశామని, విచారణ జరుగుతోందని వెల్లడించారు. రెండు రోజుల్లో నివేదిక వస్తుందని దానిపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత స్పష్టం చేశారు.
ప్రజా రక్షకుడిగా ఫోజు కొట్టడం జగన్‌కే సాధ్యం: జగన్ కన్నా మహానటుడు ఎవరు లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పదే పదే అబద్దాలు చెప్పడంతోపాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి కూడా ప్రజా రక్షకుడిగా ఫోజు కొట్టడం జగన్‌కు తప్ప ఎవరికైనా సాధ్యమౌతుందా అని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి ఇప్పుడేమో ఏమీ జరగక్కున్నా మొసలి కన్నీరు కార్చడం జగన్‌కు మాత్రమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు చేస్తున్న శ్రమను నీవు నటన అంటుంటే ప్రజలంతా నిన్ను చీదరించుకుంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. ఇప్పటికైనా నటించడం మానేసి తమలా ప్రజల సంక్షేమం కోసం పాటుపడడం నేర్చుకోమని అని హితవు పలికారు.
ధాన్యం సేకరణలో మారని తీరు - నాటి విధానాలే అమలు చేయాలంటున్న రైతులు
రెండు, మూడు రోజుల్లో కాకినాడకు సిట్ బృందం - రేషన్ మాఫియాలో గుబులు