ETV Bharat / politics

పార్లమెంట్​కు ఎన్నికైన తొలి తెలుగు నటుడు ఎవరో తెలుసా?- దేశ రాజకీయాల్లో మన సినీతారలెందరో! - Telugu film celebrities in politics

Telugu film celebrities in politics : నాటక రంగస్థలం, సినీ రంగంలోనే కాదు.. కళామతల్లి బిడ్డలెందరో రాజకీయాల్లోనూ తమదైన పాత్ర పోషించారు. ఓ వైపు సినిమాలు కొనసాగిస్తూనే సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నికల వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కొందరు పెద్దల సభకు ఎన్నిక కాగా, మరికొందరు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ సత్తాచాటి ప్రతినిధుల సభలో అడుగు పెట్టారు.

telugu_film_celebrities_in_politics
telugu_film_celebrities_in_politics
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 4:51 PM IST

Updated : Apr 26, 2024, 9:04 AM IST

Telugu film celebrities in politics : రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్నికల్లో విజయాలు అందుకున్నారు. మరికొందరు ఓ సారి ఓడినా ఆ వెంటనే గెలుపు బాటలో పయనించారు. వారి విజయం వెనుక లక్షలాది అభిమానులు, వేలాది అభిమాన సంఘాలు వెన్నంటి నిలిచాయి. పార్లమెంటులో అడుగిడిన తొలి తెలుగు నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. ఆయన చూపిన బాటలో మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించగా.. మరెందరికో ఆయన స్పూర్తి నిచ్చారు.

కొంగర జగ్గయ్య

లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు ఆయన. కళావాచస్పతి, కంచు కంఠం ఆయనకున్న ప్రత్యేకమైన బిరుదులు. నాటకం, సినిమా, జర్నలిజం, రాజకీయ రంగాల్లో వెలుగొందిన జగ్గయ్య 1967లో జరిగిన నాలుగో లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1962లోనే ఆ అవకాశం వచ్చినా రాజకీయ నైతిక విలువలు పాటించి పోటీకి దూరంగా ఉన్న గొప్ప వ్యక్తి జగ్గయ్య. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగ్గయ్య విజయంతో సినీ పరిశ్రమ ఉత్సాహంతో ఉప్పొంగి పోయింది.

దాసరి నారాయణరావు

సందేశాత్మక చిత్రాల సృష్టికర్త దాసరి నారాయణరావు. నటుడిగా, దర్శకుడిగా, రచయిత, నిర్మాతగా రాణించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అత్యధిక చిత్రాల (150) దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కిన దాసరి రాజకీయాల్లో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1990 దశకం చివరిలో 'తెలుగు తల్లి' పార్టీని స్థాపించినప్పటికీ చివరికి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి సన్నిహితుడు మన దాసరి.

రావు గోపాలరావు

సినిమాలో చప్పట్లు కొట్టేంతగా ఐదైనా పాత్రను పోషిస్తే గొప్ప నటన అంటారు. కానీ పరకాయ ప్రవేశం చేయడం ద్వారా ఆ పాత్రలో జీవించడం కేవలం రావు గోపాలరావు కే సాధ్యం. 'పైనేదో మర్డర్​ జరిగినట్టు లేదూ ఆకాశంలో.. సూరీడూ నెత్తురు గడ్డలా లేడూ.. మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా.. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి, గొడ్డుకి తేడా ఏటుంటాది?' ఇలా గోదావరి యాసలో సుదీర్ఘమైన డైలాగులతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు రావు గోపాలరావు. తెలుగుదేశం పార్టీలో చేరిన రావు గోపాల్​ రావు ఎమ్మెల్సీగా, ఎంపీగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 1984-85 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, 1986-1992వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

ఘట్టమనేని కృష్ణ

'మోసగాళ్లకు మోసగాడు', 'గూఢచారి' సూపర్​ స్టార్​ కృష్ణ పార్లమెంట్​ సభ్యుడిగానూ సేవలు అందించారు. 1989లో జరిగిన 9వ లోక్​సభ ఎన్నికల్లో ఏలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరో సినీ నటుడు మురళీ మోహన్​ క్లాస్​మేట్​ అయిన కృష్ణ తాను బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ సినిమాల్లోకి వెళ్లాలన్న ప్రేరణ కలిగించింది. అప్పట్లో కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉన్నట్లు సమాచారం.

కృష్ణం రాజు

రెబల్​ స్టార్ కృష్ణంరాజు కాకినాడ, నర్సాపురం ఎంపీగా లోక్​సభలో అడుగుపెట్టారు. 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా స్థానం సంపాదించారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

జమున

ఎన్టీఆర్​, ఏఎన్నార్ హీరోగా నటించిన చాలా సినిమాల్లో ఆమే హీరోయిన్. చిన్నతనంలోనే నాటకాల్లో రాణించిన జమున స్వస్థలం కర్ణాటక అయినా తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్​ పార్టీలో చేరిక ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జమున రాజమండ్రి ఎంపీగా లోక్​సభలో అడుగుపెట్టారు. 1989 సంవత్సరంలో జరిగిన 9వ లోక్​సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించిన జమున తిరిగి 1991లో టీడీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. సూపర్​స్టార్​ కృష్ణ, జమున ఒకేసారి పార్లమెంటులో అడుగుపెట్టడం విశేషం.

కైకాల సత్యనారాయణ

సినీరంగంలో ఆయన నవరస నటనా సార్వభౌముడు. చదువే తనకు ముఖ్యమని డిగ్రీ చదివే రోజుల్లోనే సినీ రంగంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు కైకాల సత్యనారాయణ. కానీ, తిరిగి సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తూ 15రోజుల పాటు పార్కులోనే గడిపాల్సి రావడం విశేషం. కైకాల సత్యనారాయణ మచిలీపట్నం ఎంపీగా టీడీపీ తరఫున ఎన్నికై ప్రజా సేవలో పాల్గొన్నారు. 1996లో జరిగిన 11వ లోక్​సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తిరిగి 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అవకాశం దక్కినా కాంగ్రెస్​ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

మురళీ మోహన్​

తెలుగు సినిమా కథానాయకుడు మాగంటి మురళీమోహన్ టీడీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా లోక్​సభలో అడుగుపెట్టారు. మురళీ మోహన్​ పూర్వ నామం రాజబాబు. తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షితుడైన మురళీ మోహన్​ ఆ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో స్వల్ప తేడా (2,147 ఓట్లు)తో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టారు.

telugu_film_celebrities_in_politics
telugu_film_celebrities_in_politics

చిరంజీవి

యావత్​భారతావనిలో అప్పటికి ఏ నటుడూ తీసుకోని పారితోషికం ఆయనది. 'బిగ్గర్​ దాన్​ బచ్చన్'​ అని జాతీయ పత్రికలు ఆయన్ని కీర్తించాయి. దాదాపు 10కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమా కూడా ఆయనదే. సగటు సినీ ప్రేక్షకుడే కాదు.. చిరంజీవి అంటే తెలియని తెలుగువారుండరు. సామాజిక న్యాయం నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఎంతో మంది వివిధ రంగాల ప్రముఖులతో మేధోమథనం నిర్వహించి 2008 ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి అనతి కాలంలోనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకుని పార్లమెంటులో అడుగుపెట్టారు.

హరికృష్ణ

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ కుమారుడు హరికృష్ణ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. టీడీపీ ఆవిర్భావంలో ఎన్టీఆర్​ ఎన్నికల ప్రచార రథం (చైతన్య రథం) దాదాపు 75వేల కిలోమీటర్లు డ్రైవ్​ చేశారు హరికృష్ణ. 1996లో హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన హరికృష్ణ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీలో మహిళలకు అవకాశం ఇవ్వడంతో వందలాది మంది బస్ కండక్టర్లుగా నియమితులయ్యారు. 1999లో అన్నా తెలుగుదేశం (ATDP)పార్టీని స్థాపించిన హరికృష్ణ తిరిగి 2006లో టీడీపీలో చేరారు. 2008లో రాజ్యసభకు ఎన్నికై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేశారు.

రామానాయుడు

శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్ ఆయన సొంతం. 21మందికి దర్శకత్వ మార్గం చూపించి, మరో ఆరుగురిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ మొఘల్​గా పిలుచుకొనే డాక్టర్​ డి. రామానాయుడు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 1999లో జరిగిన 13వ లోక్​సభ ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంట్​ వెలుపల ఆయన చేపట్టిన నిరసన ప్రతి ఒక్కరికీ గుర్తే. సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన శివ ప్రసాద్​ యాదవ్​ చిత్తూరు ఎంపీగా రెండుసార్లు గెలుపొందారు. టీడీపీలో చేరికతో రాజకీయాల్లోకి వచ్చిన శివప్రసాద్​ 2009, 2014లో చిత్తూరు లోక్​సభ స్థానం నుంచి విజయం సాధించారు.

మంచు మోహన్​బాబు

కలెక్షన్​ కింగ్​ మంచు మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 72 సినిమాలు నిర్మించి 573 సినిమాల్లో నటించిన మోహన్​బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో జన్మించిన మోహన్​బాబు సినీరంగం ప్రవేశానికి ముందు పీఈటీగా పనిచేశారు. ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావును తన గురువుగా భావించే మోహన్​బాబు రజనీకాంత్​కు సన్నిహితుడు. 1995 నుంచి 2001 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు.

శారద

తెనాలి గడ్డపై పుట్టిన ఆమె పూర్వ నామం సరస్వతి. ఆ తర్వాత శారదగా, ఊర్వశి అవార్డు ఫలితంగా ఊర్వశి శారదగా వెలుగొందారు తాడిపర్తి శారద. తెలుగువారైనా మళయాళీని వివాహమాడి పలు సినిమాల్లో నటిగా రాణించారు. తిరిగి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శారద టీడీపీలో చేరిక ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో 11వ లోక్‌సభకు అప్పటి తెనాలి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. రెండేళ్లకే లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరో సారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

జయప్రద

ఆంధ్రప్రదేశ్​ సాంస్కృతిక నగరం రాజమండ్రిలో జన్మించారు అలనాటి అందాల తార జయప్రద. ఆమె అసలు పేరు లలితారాణి. ఓ నాట్య ప్రదర్శనలో దర్శకుడు ఎం.ప్రభాకరరెడ్డి ఆమెను చూసి జయప్రద పేరుతో చిత్రసీమకు పరిచయం చేశారు. నందమూరి తారక రామారావు ఆహ్వానం మేరకు 1994లో టీడీపీలో చేరిన జయప్రద చంద్రబాబు హయాంలో పార్టీ మహిళా విభాగం పగ్గాలు చేపట్టారు. 1996లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి 2004 సంవత్సరంలో 13న లోక్ సభకు ఎన్నికయ్యారు.

విజయశాంతి

లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ విజయశాంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2009 సంవత్సరంలో లోక్​సభకు ఎన్నికయ్యారు. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరికతో రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయశాంతి మహిళా విభాగం (భారతీయ మహిళా మోర్చా) కార్యదర్శిగా పని చేశారు. 1999లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కడప లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని భావించారు. సోనియా బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్​ఎస్​లో విలీనం చేశారు. 2009లో ఆ పార్టీ ​ తరఫున మెదక్​ లోక్​సభ స్థానానికి ఎన్నికయ్యారు.

Last Updated : Apr 26, 2024, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.