MLA Alla rejoined YSRCP : మంగళగిరి శాసనసభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. మంగళగిరి వైసీపీ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. మంగళగిరి వైసీపీ సమన్వయకర్త బాధ్యతల్ని పార్టీ అధిష్టానం గంజి చిరంజీవికి ఇవ్వటంతో అలిగి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ ఇప్పుడు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు
మా కుటుంబ సభ్యులే మందలో తప్పి పోయిన గొర్రె పిల్లల్లా తిరిగి పార్టీలోకి వస్తున్నాయని, వాటిని దగ్గరకు తీసుకుంటున్నామని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే (Mangalagiri MLA RK) తిరిగి వైసీపీలోకి చేరుతున్న అంశంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సభలకు భయపడి చంద్రబాబుకు బీపీ, షుగర్ పెరిగిపోతున్నాయని మంత్రి ఆక్షేపించారు. గత ఎన్నికల్లో సైకిల్ ను మడతపెట్టామని ఈసారి వారికి మద్దతు ఇచ్చేవారిని కూడా మడతపెడతామని మంత్రి అన్నారు.
వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతా: ఆళ్ల రామకృష్ణారెడ్డి
తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీని మంగళగిరిలో మూడో సారి గెలిపించేందుకు పార్టీలో చేరానన్నారు. పార్టీకి రెండు నెలలు దూరంగా ఉన్నా ఇప్పుడు తిరిగి చేరానన్నారు. వైనాట్ 175లో తాను కూడా భాగస్వామి కావాలని, 25 పార్లమెంటు స్ధానాలు తిరిగి సాధించేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో ఏ అభ్యర్ధిని నిలబెట్టినా పూర్తిస్ధాయిలో భేషరతుగా పనిచేస్తానన్నారు. ప్రతిపక్షాలు (Opposition parties)అన్ని రాజకీయంగా ఏకం అయ్యాయని, 2019లో నారా లోకేశ్ (Nara Lokesh) మంగళగిరిలో ఓసీ అభ్యర్థిపై ఎలా ఓడిపోయారో 24లోను బీసీ అభ్యర్ధి చేతుల్లో నారా లోకేశ్ ఓటమి చెందుతారని జోస్యం చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్టు షర్మిలకు చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి జగన్ ఓడించాలని చూస్తున్నాయని ఆర్కే తెలిపారు.
ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?
మళ్లీ అధికారంలోకి రావడం కలే : వైసీపీలో సర్వం పొగొట్టుకున్నానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (MLA Alla Ramakrishna Reddy) తన రాజీనామా సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం విదితమే. సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకుని అభివృద్ధిని గాలికి వదిలేసిన జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారని ఆయన అప్పట్లో తీవ్రంగా విమర్శించారు. మంగళగిరికి రూ.1200 కోట్లు కేటాయించామని ఆర్భాటంగా ప్రకటించిన సీఎం జగన్ చివరికి రూ.120 కోట్లకు కుదించారని, జగన్ మాటలు నమ్మి సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడితే ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. అభివృద్ధి చేయకుండా మళ్లీ మంగళగిరి ప్రజలను ఓట్లు అడగలేకే రాజీనామా చేశానని చెప్పడం తెలిసిందే.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?