Mandali Buddha Prasad Joined Janasena: అవనిగడ్డ తెలుగుదేశం నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. అదే విధంగా మరో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ వెళ్లిన పవన్, తిరిగి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో గొల్లప్రోలు వచ్చారు. రోడ్డు మార్గంలో పిఠాపురంలో తాను బస చేస్తున్న గోకుల్ గోకులం గ్రాండ్ వద్దకు వచ్చారు. పవన్‌కు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తాజాగా పిఠాపురంలో పవన్ సమక్షంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు.