Legislature and Council Meetings Adjourned Indefinitely: 16వ శాసనసభ మొదటి సమావేశాలను వేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పటి వరకు శాసనసభ ఆరు రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ జరిగిందని స్పీకర్ అయ్యన్న వివరించారు. సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని తెలిపారు. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటని తెలిపారు. శాసనసభలో సీఎం చంద్రబాబు 3 ప్రకటనలు చేశారని అన్నారు. 2 బిల్లులు ప్రవేశ పెట్టారని అవి ఆమోదం పొందాయని స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల ప్రసంగాలు 68 కాకా 344 నిబంధన కింద చర్చ జరిగిందని స్పీకర్ అయ్యన్న వివరించారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో వైసీపీ విధ్వంస పాలనపై మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారని అన్నారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల అంశాలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేశారని స్పీకర్ అయ్యన్న స్పష్టం చేశారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా- వైసీపీ విధ్వంస పాలనపై మూడు శ్వేత పత్రాలు - Assembly Sessions End - ASSEMBLY SESSIONS END
Legislature and Council Meetings Adjourned Indefinitely: శాసనసభ, మండలి నిరవధిక వాయిదా పడింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో వైసీపీ విధ్వంస పాలనపై సీఎం చంద్రబాబు మూడు శ్వేత పత్రాలు విడుదల చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 3:55 PM IST
|Updated : Jul 26, 2024, 7:04 PM IST