ETV Bharat / politics

45 రోజుల పాలనలో దిల్లీ పర్యటనలు మినహా సీఎం రేవంత్ సాధించింది ఏమీ లేదు : కేటీఆర్ - ktr fires on congress party

KTR CHIT CHAT 2024 : కాంగ్రెస్ తత్వం, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల ఆధారంగానే కేసీఆర్​ను త్వరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామన్న ప్రజల అభిప్రాయాన్నే తాను చెప్పానని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బహుళజాతి సంస్థలతో ప్రయోజనం ఉండబోదన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలు చూస్తుంటే, దావోస్ ఎందుకు వెళ్లారని సీఎం రేవంత్​ను ప్రశ్నించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. రైతు భరోసా అమలు చేస్తున్నామంటూ అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, నామినేటెడ్ నియామకాలు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య ఇంతకంటే డీప్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏముంటుందని ప్రశ్నించారు. శనివారం నుంచి రోజుకు పది చొప్పున శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

KTR fires on Congress government
KTR CHIT CHAT 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 7:22 PM IST

Updated : Jan 25, 2024, 7:40 PM IST

KTR CHIT CHAT 2024 : లోక్​సభ ఎన్నికల కసరత్తులో భాగంగా భారత రాష్ట్ర సమితి శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించనుంది. రోజుకు పది నియోజకవర్గాల చొప్పున ఫిబ్రవరి పదో తేదీలోపు సమావేశాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సమావేశానికి రాష్ట్ర పార్టీ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఈ నెల 27న మొదటి రోజు సిద్దిపేట, జూబ్లీహిల్స్, వనపర్తి, బోథ్, నల్గొండలో సమావేశాలు జరగనున్నాయి. పార్టీ నాయకులు, సానుభూతిపరులు, కార్యకర్తలు ప్రతి బూత్​లో ఒక సోషల్ మీడియా వారియర్ ఉండేలా తెలంగాణ బలగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు.

BRS Meetings by Assembly Constituencies : క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు జిల్లాలోని పార్టీ కార్యాలయాలతో తెలంగాణ భవన్​కు అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. కార్యక్రమాల అమలు కమిటీ ఏర్పాటు, పర్యవేక్షణ, లైబ్రరీ, రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు. లోక్​సభ సన్నాహక సమావేశాల్లో చాలా అభిప్రాయాలు, సూచనలు వచ్చాయన్న ఆయన, అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాల తర్వాత సీనియర్ల సమావేశంలో అన్ని విషయాలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. పురపాలికల్లో అవిశ్వాసాలు వచ్చిన చోట పార్టీ తరఫున విప్ ఇస్తున్నామని, ధిక్కరించిన వాళ్ల సభ్యత్వాలు పోయేలా పోరాడతామని తెలిపారు.

మరో ఏక్​నాథ్​ షిండేగా రేవంత్​ మారినా ఆశ్చర్యం లేదు : కేటీఆర్

KTR Fires on Congress : లోక్​సభ ఎన్నికల్లో పోటీకి ఆశావహులు చాలా మంది ఉన్నారని, సిట్టింగులతో పాటు సీనియర్లు చాలా మంది ఆసక్తితో ఉన్నారని కేటీఆర్ వివరించారు. గత లోక్​సభ ఎన్నికల తరహాలోనే సానుభూతి పని చేస్తుందని ఇటీవల ఓడిపోయిన కొందరు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంపై ఇంత వేగంగా అసంతృప్తి రావడం ఇది మొదటిసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొత్తగా వచ్చిన వాళ్లకు సమయం ఇవ్వాలని, అయితే వారికి సహనం కూడా ఉండాలని అన్నారు. రైతు బంధు ఇవ్వలేదు అంటే చెప్పుతో కొడతా అంటే రైతులు హర్ట్​ అవ్వరా? అని ప్రశ్నించారు. రెండెకరాల వరకు అందరికీ రైతుబంధు పడలేదని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అందరికీ ఇస్తారేమోనని అన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై పార్టీ కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా కేంద్రానికి దాఖలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించిన కేటీఆర్, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయమై అసెంబ్లీలో, అఖిలపక్షంలో చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు హామీలు పక్కన పెట్టి, ఏదో జరుగుతున్నట్లు హడావిడి చేస్తున్నారని, వారిచ్చిన 420 హామీలు నిలబెట్టుకునే దిశగా ప్రజల తరఫున గొంతు విప్పుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్

అప్పులెందుకన్నారు, మరి ఆ నిర్మాణాల సంగతేంటి : కొత్త సచివాలయం, అసెంబ్లీ అంటే అవసరమా అన్న వారు, కొత్త హైకోర్టు గురించి ఏమంటారని, అప్పుల పాలు అంటారు, కొత్త సీఎం క్యాంపు కార్యాలయం ఎందుకు అని ప్రశ్నించారు. రైతుబంధుకు డబ్బులు లేవు అంటారు, కొత్త క్యాంపు కార్యాలయం, దిల్లీలో కొత్త తెలంగాణ భవన్ అవసరమా? అని నిలదీశారు. సీఎం 45 రోజుల్లో చాలాసార్లు దిల్లీ వెళ్లారన్న కేటీఆర్, పాలన దిల్లీ నుంచి నడుస్తుందని తాము చెప్పినట్లే జరుగుతోందని వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటన వృథా అని గతంలో తనను విమర్శించిన వారు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. బహుళజాతి సంస్థలతో సామాజిక న్యాయం ఉండదని, ప్రయోజనం లేదని ఉప ముఖ్యమమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారన్న కేటీఆర్, ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే దావోస్ ఎందుకు వెళ్లారని సీఎంను భట్టి ప్రశ్నించినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

ఈ నెల నుంచి ఎవరు కరెంట్‌ బిల్లు కట్టవద్దు : కేటీఆర్

రైతులకు క్షమాపణ చెప్పాలి : ఈ క్రమంలోనే అదానీని తాము పదేళ్లు రానివ్వలేదని, వీళ్లు గేట్లు తెరిచారని ఎద్దేవా చేశారు. రాహుల్ తిడుతుంటే, రేవంత్ అదానీతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. బెల్ట్ దుకాణాలు ఎత్తి వేస్తామన్నారని, ఇప్పుడు ఎలైట్ బార్లు పెడతామంటున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం నుంచి నీరు రాలేదంటూనే, లక్ష ఎకరాలకు కొండా సురేఖ నీళ్లు వదిలారని వివరించారు. అధికారం ప్రభుత్వం చేతిలో ఉందని, ఎలాంటి విచారణ అయినా చేసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.

రైతుభరోసా ఇస్తున్నామని దావోస్​లో పచ్చి అబద్దం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసా, వరికి 500 బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. ఎన్నికల కోడ్ చూపి గ్యారెంటీల అమలు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నిలదీస్తారని, అమలు కోసం తాము పట్టుబడతామని చెప్పారు. గ్యారెంటీల అమలుపై ఇప్పుడు ఉత్తర్వులు ఇస్తే ప్రజలు నమ్ముతారని, ఎన్నికల కోడ్ ఇబ్బంది కూడా ఉండదని సూచించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీ కాలం అయిపోతుందని, పూర్తైన భవనాల ప్రారంభోత్సవాలను చాలాచోట్ల అడ్డుకోవడం సమంజసం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సర్పంచుల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించవద్దన్న ఆయన, ప్రజాపాలనలో సర్పంచులకు గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని లేదా ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం పొడిగించాలని కోరారు.

బీఆర్ఎస్​కి కార్యకర్తలే కథానాయకులు - వారే పార్టీకి ధైర్యం చెప్పారు : కేటీఆర్

ముఖ్యమంత్రిగా ఐదేళ్లు కష్టమే : సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అధికారిక సమావేశాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించిన కేటీఆర్, సలహాదారులు వద్దని కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇవాళ రాజకీయ పునరావాసంగా సలహాదారులను నియమించారని ఆరోపించారు. ఒకరినే ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగించడం కాంగ్రెస్ తత్వం కాదని అన్నారు. ఉపముఖ్యమంత్రి ఉండగానే ఇంకొకరు నంబర్ టూ అంటున్నారని, పారాచూట్ లీడర్లు అని డిప్యూటీ సీఎం సతీమణి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. మంత్రులే అలా మాట్లాడుతుంటే తమ కార్యకర్తలకు అనుమానం రావడంలో తప్పేమీ లేదన్న ఆయన, తమకు ఎలాంటి తొందరలేదని, కుట్రలకు పాల్పడేది లేదని తెలిపారు. త్వరలోనే కేసీఆర్​ను సీఎం చేసుకుందామని ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే తాను చెప్పానని వివరించారు.

'కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించండి'

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు : కేసీఆర్ లేకుండా చేయాలని రెండు జాతీయ పార్టీలు కూడబలుక్కున్నాయని, కాంగ్రెస్, బీజేపీలు వెయ్యి శాతం లోక్​సభ ఎన్నికల్లో కుమ్మక్కు అవుతాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీల ఉపఎన్నిక, నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య అవగాహన స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డిని తప్పు పడుతున్న గవర్నర్​కు, ఈటల, రాజాసింగ్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వినిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదు కానీ, ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని అడిగారు. ఇంతకంటే డీప్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. కరీంనగర్​కు ఎవరు ఏం చేశారో బండి సంజయ్​కు చిత్తశుద్ధి ఉంటే వినోద్ కుమార్​తో చర్చకు సిద్ధమా? అని సవాల్​ విసిరారు. కరీంనగర్​లోని చాలా మండలాలకు బండి సంజయ్ మొహం కూడా చూపలేదని అన్నారు.

బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య మాటల యుద్ధం

Last Updated : Jan 25, 2024, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.