People Faced Difficulties Due to Jagan Bus Yatra: ప్రకాశం జిల్లా కనిగిరిలో జగన్ సభకు బస్సులను తరలించడంతో స్థానిక ఆర్టీసీ డిపో నిర్మానుష్యంగా మారింది. బస్సులు లేక ప్రయాణికులు ఎర్రటి ఎండలో చంటి బిడ్డలను ఎత్తుకుంటూ రోడ్లు వెంబడి నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి వెళ్లే రహదారి వెంట స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు భారీ సంఖ్యలో ప్రజలను తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలే సూర్యుడు నిప్పులు చెరుగుతున్న సమయంలో రోడ్లపైనే వారిని వదిలేసి కనీస సౌకర్యాలూ కల్పించకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. తాగేందుకు నీరు ఏర్పాటు చేయకపోవడంతో ఏదో ఒక ప్రాంతంలో నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నారని సమాచారంతో ఒక్కసారిగా అక్కడికి గుమిగూడారు. ప్రజలు ఒకరిపై ఒకరు పడి వాటర్ ప్యాకెట్ల కోసం పోటెత్తారు.
సీఎం వస్తే చెట్లు నరికేస్తారా ? ఇదెక్కడి తీరంటూ స్థానికుల ఆగ్రహం - TREES CUTTING FOR JAGAN TOUR
బస్సుల కోసం పడిగాపులు: సీఎం జగన్ కార్యక్రమం ఉన్నప్పుడల్లా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్కాపురం డిపోకు చెందిన సుమారు 70 బస్సులు సిద్ధం సభకు తరలించారు. మార్కాపురం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక బస్టాండ్‌లోనే ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉగాది సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు మార్కాపురం నుంచి శ్రీశైలం చేరుకుంటారు. వారికీ జగన్ రాకతో ఇబ్బందులు తప్పలేదు.
అక్రమమైన సక్రమమైన ఆ వైఎస్సార్సీపీ నేతకు కప్పం కట్టాల్సిందే! - YCP leader irregularities in AP
విద్యుత్ అధికారులు అత్యుత్సాహం: సీఎం పర్యటనతో కనిగిరిలో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ బస్సుయాత్ర సాగే రహదారిలో అధికారులు విద్యుత్ తీగలను తొలగించారు. కరెంటు వైర్లను తొలగిస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. కనిగిరితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కనిగిరి ప్రజలకు నిరాశ: మిప్రకాశం జిల్లా కనిగిరి జగన్ పర్యటన ప్రజలకు నిరాశ మిగిల్చింది. ఉదయం 10 నుంచి తీవ్ర ఎండ, ఉక్కపోతను భరిస్తూ సీఎం కోసం ప్రజలు నిరీక్షించినప్పటికీ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడంపై స్థానికులకు కోపం తెప్పించింది. జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ రెండు నిమిషాలు బయటకు కనిపించి వెంటనే బస్సులోకి వెళ్లి కూర్చున్నారు. అభిమానంతో ఎంతో ఖర్చు చేసి తయారు చేసిన గజమాలను వేయించుకునేందుకు జగన్ నిరాకరించడంతో అభిమానులు, కార్యకర్తలు అసహనంతో గజమాలను అక్కడే పడేసి వెళ్లిపోయారు.
లెక్కలేనన్ని హామీలిచ్చారు - ఐదేళ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు - YCP Not solve People Problems
ఎవరూ ఊహించనంతగా ఏపీ అభివృద్ధి: 58 నెలల పాలనలో ఎవరూ ఊహించనంతగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహిళల సాధికారితకు పెద్దపీట వేశామన్న జగన్ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందిచామని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.