Visakha MLC Election : ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల కానుంది. అదేరోజు నుంచి ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరుసటి రోజు 14న స్క్రూటినీ, ఆగస్టు 16న నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఉప ఎన్నిక పోలింగ్ ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 841 ఓట్లు ఉండగా అందులో వైఎస్సార్‌సీపీ బలం 615 ఉంటే, టీడీపీ, జనసేన, బీజేపీలకు కలిపి మొత్తం 215 ఓట్లు ఉన్నాయి. మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - MLCs Unanimously Elected
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉంటారు. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఇక్కడనుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ తాజాగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు పోటీపై కసరత్తు మొదలుపెట్టాయి.
"ఇది శాంపిల్ మాత్రమే.. వచ్చే ఎన్నికల్లో సునామీ.. వైసీపీ గల్లంతు ఖాయం"
ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజయంపై ఇరు పార్టీల ధీమా
ఇప్పటికే సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనుకుంటోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలలో దారుణ ఓటమి చూసిన వైఎస్సార్సీపీ కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకుని రాజకీయంగా ఉరట పొందాలని చూస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని వైకాపా పార్టీ దాదాపు ఖరారు చేసింది.
ఇక కూటమి వైపు నుంచి మాజీ శాసనసభ్యులు గండి బాబ్జి, అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణమూర్తి, భీమిలి టిడిపి ఇన్చార్జిగా ఉన్న కోరాడ రాజబాబులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 852 మంది ఓట్లు ఉండగా వాటిలో 129 కూటమి మద్దతుదారుల ఓట్లుగా ఉన్నాయి. మిగిలిన 723 మంది వైఎస్సార్సీపీకి మద్దతు ఓట్లు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల తర్వాత సుమారుగా మరో 150 మంది వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి మద్దతు పలికారు. అలా చూసుకున్నా సుమారుగా 300 ఓట్లు ప్రస్తుతం కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువ శాసన సభ స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో శాసనసభ్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు దృష్టి పెడితే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుందని కూటమి నేతల అంచనా వేస్తున్నారు.